Balakrishna: వారసత్వానికి అసలైన అర్థం ఇదే.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్!

కాజల్ (Kajal Aggarwal) , నవీన్ చంద్ర  (Naveen Chandra)ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సత్యభామ (Satyabhama) మూవీ ఈవెంట్ కు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ ఎలక్షన్స్ పూర్తైన వెంటనే ఫుల్ జోష్ తో కొత్త సినిమా షూట్ ప్రారంభించాలని అనుకున్నానని తెలిపారు. కానీ ఇప్పటివరకు మొదలుపెట్టలేదని బాలయ్య నవ్వుతూ కామెంట్లు చేశారు. దాదాపుగా 50 రోజుల పాటు కెమెరాను మిస్ అయ్యానని ఆయన పేర్కొన్నారు.

నేను కెమెరాను మిస్సైన లోటును సత్యభామ ఈవెంట్ భర్తీ చేసిందని బాలయ్య తెలిపారు. కొన్ని పవర్ ఫుల్ పేర్లను విన్న వెంటనే వైబ్రేషన్ వస్తుందని అలాంటి పేర్లలో సత్యభామ కూడా ఒకటని ఆయన చెప్పుకొచ్చారు. సత్యభామ మూవీలో కాజల్ అద్భుతంగా ఫైట్స్ చేసిందని బిడ్డకు జన్మనిచ్చినా కాజల్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటారని బాలయ్య పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీపై పట్టు సాధించాలని నేను కూడా భావించేవాడినని ఆయన అన్నారు.

నాన్న నారదుడిగా నటించలేదని నేను మాత్రం శ్రీనివాస కళ్యాణంలో నారదుడిగా నటించానని బాలయ్య చెప్పుకొచ్చారు. వారసత్వం అంటే నాన్న సినిమాల గురించి, పద్ధతి గురించి చెప్పుకోవడం కాదని ఆచరిస్తున్నామా అనేది ముఖ్యమని వారసత్వానికి అసలైన అర్థం అదేనని బాలయ్య పరోక్షంగా పేర్కొన్నారు. నాన్నగారి వారసులుగా టాలీవుడ్ నటులంతా ముందుకు దూసుకెళ్తున్నందుకు ఆనందంగా ఉందని బాలయ్య చెప్పుకొచ్చారు.

హీరోయిన్ గా కాజల్ 15 సంవత్సరాల ప్రయాణం చేయడం మామూలు విషయం కాదని బాలయ్య పేర్కొన్నారు. కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ భగవంత్ కేసరి  (Bhagavath Kesari) సినిమాతో మొదలైందని ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నానని బాలయ్య అన్నారు. బాలయ్య చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలయ్య ప్రస్తుతం బాబీ (Bobby) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.