
సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఎంత మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిర్మాత ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu) తండ్రి, సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) తండ్రి, దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ (Surya Kiran), ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్, త్రినాథ్ రావు నక్కిన (Trinadha Rao Nakkina) తండ్రి నక్కిన సూర్యారావు, సీరియల్ నటి పవిత్ర జయరాం, మరో సీరియల్ నటుడు చందు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో నటి మరణించడం అందరికీ షాకిచ్చినట్టు అయ్యింది.
గతంలో రాజశేఖర్ (Rajasekhar) తో సినిమా చేసిన ఓ దర్శకుడు ఈరోజు మరణించినట్టు తెలుస్తుంది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు సూర్య ప్రకాష్ ఈరోజు(సోమవారం నాడు) ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. తమిళ సీనియర్ హీరో, రాజకీయవేత్త అయినటువంటి శరత్ కుమార్ (R. Sarathkumar) ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సూర్య ప్రకాష్ మరణ వార్త తనని ఎమోషనల్ గా బాగా డిస్టర్బ్ చేసిందని తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
సూర్య ప్రకాష్ ఆత్మకు శాంతి చేకూరాలి అని ఆయన కోరుతున్నట్లు తెలిపారు. ‘మాణిక్కం’ ‘మాయి’ వంటి తమిళ చిత్రాలతో ఇతను బాగా పాపులర్ అయ్యాడు. ‘మాయి’ చిత్రం ‘సింహరాశి’ పేరుతో తెలుగులో రీమేక్ అయ్యింది. తర్వాత ఆయన తెలుగులో నేరుగా రాజశేఖర్ తో ‘భరతసింహారెడ్డి’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని తేజ నిర్మించడం విశేషం.