Cannes Film Festival: కాన్స్‌లో మన సినిమాలు… ఏమేం ప్రదర్శిస్తున్నారంటే?

ప్రపంచ ప్రఖ్యాత కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రంగం సిద్ధమైంది. మామూలుగా అయితే అదేదో హీరోయిన్ల ర్యాంప్‌ వాక్ కోసం అనుకుంటారు కానీ.. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన మేటి సినిమాలను ప్రదర్శిస్తారు. అలా ఈ ఏడాది కూడా సినిమా ఉత్సవం జరగనుంది. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ మంగళవారం నుండి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అక్కడ పోటీ పడబోతున్న ఇండియన్‌ సినిమాలేంటి అనే చర్చ మొదలైంది. ఈ ఏడాది కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రెండు భారతీయ సినిమాలు పోటీ పడనున్నాయి.

రాధికా ఆప్టే (Radhika Apte) ప్రధాన పాత్రధారిగా రూపొందిన ‘సిస్టర్‌ మిడ్‌నైట్‌’ అనే సినిమా బరిలో నిలుస్తోంది. కరణ్‌ కాంధారి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డైరెక్టర్స్‌ ఫార్టునైట్‌ విభాగంలో ప్రదర్శితం కానుంది. భారత్‌ నుంచి ఈ విభాగానికి ఎంపికైన ఏకైక సినిమా ఇది. కొత్త కాపురంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి అనుకోని సమస్యల్లో ఇరుక్కుంటుంది. ఆ సమస్యలకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ అమ్మాయి ఏం చేసింది అనేది ఈ సినిమాలో చూపించారు.

హాస్యం, ప్రేమ కలబోతగా ఈ సినిమా రూపొందింది. వెల్లింగ్టన్‌ ఫిల్మ్స్‌, రాధికా ఆప్టే, సూటబుల్‌ పిక్చర్స్‌ కలసి నిర్మించిన చిత్రమిది. సిక్కిం దర్శకుడు సామ్తెన్‌ భుటియా దర్శకత్వం వహించిన ‘తార: ది లాస్ట్‌ స్టార్‌’ అనే సినిమా కూడా కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. సావిత్రీ ఛెత్రీ నిర్మించిన ఈ సినిమా ఓ సోషల్‌ డ్రామా. హిమాలయ పర్వత సానువులు, సిక్కిం రాష్ట్రంలోని ప్రజల సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా సినిమాను తెరకెక్కిచారు.

వీటితోపాటు పాయల్‌ కపాడియా ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాస్‌ లైట్‌’, సంధ్యా సూరి రూపొందించిన ‘సంతోష్‌’, సయ్యద్‌ మైసమ్‌ అలీ షా ‘ఇన్‌ రిట్రీట్‌’, కోన్‌స్టాటిల్‌ బాంజో తెరకెక్కించిన ‘ది షేమ్‌లెస్‌’, ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ ఐకానిక్‌ సినిమా ‘మంథన్‌ : ఏ సినిమాటిక్‌ జెమ్‌ రీబోర్న్‌’, ఊళ్లో కోళ్లను దొంగిలించే ఓ మహిళ నేపథ్యం కథతో ఎఫ్‌టీఐఐ స్టూడెంట్స్‌ తెరకెక్కించిన ‘సన్‌ ఫ్లవర్స్‌ వర్‌ ది ఫస్ట్‌ టు నో’, అస్సామ్‌లో తెరకెక్కించిన హిందీ సినిమా ‘కూకి’ కూడా కాన్స్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.