Chinmayi Sripaada: బాలయ్య అంజలి వీడియో గురించి చిన్మయి షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna) ఈ మధ్య కాలంలో ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) మూవీ ఈవెంట్ సమయంలో అంజలిని (Anjali)  బాలయ్య తోసేశారంటూ కామెంట్లు వినిపించగా ఈ వివాదంపై అంజలి స్పందిస్తూ బాలయ్యకు సపోర్ట్ గా రియాక్ట్ అయ్యారు. అయితే సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి (Chinmayi Sripaada) మాత్రం పవర్ లో ఉన్నవాళ్లను తప్పుగా చూపేందుకు సమాజం ఒప్పుకోదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్మయి తన ట్వీట్ లో బాలయ్య అంజలి వీడియోను షేర్ చేస్తున్న వాళ్లలో నేను ఒక అతిపెద్ద సమస్యను గమనించానని ఆమె అన్నారు.

అంజలి నవ్వు వైపు చూడండని ఆమెకు ఉండాలి కదా అంటూ చిన్మయి చెప్పుకొచ్చారు. ఇలాంటివి చూసిన సమయంలో ప్రేక్షకుల రియాక్షన్ పై స్పందించడం సాధ్యం కాదని చిన్మయి వెల్లడించారు. ఎందుకంటే ఇది మోరల్ పోలీసింగ్ కంటే పవిత్రమైనదని ఆమె పేర్కొన్నారు. హరిశ్చంద్ర, శ్రీరామచంద్రమూర్తి, వారి బంధువుల అవతారాలు అర్థం చేసుకోకపోతే పొరపాటు అవుతుందని చిన్మయి చెప్పుకొచ్చారు.

పవర్ లో ఉన్నవాళ్లను తప్పుగా చూపేందుకు ఈ సమాజమే ఒప్పుకోదని ఆమె కామెంట్లు చేశారు. ప్రధానంగా డబ్బు, కులం, రాజకీయ బలం నుంచి వచ్చిన వాళ్లను తప్పుగా చూపిస్తే సమాజం ఒప్పుకోదని చిన్మయి వెల్లడించడం గమనార్హం. అయినా ఇందులో మీకు ఎలాంటి నష్టం లేనప్పుడు మహిళలకు ఎలా ప్రవర్తించాలో చెప్పకండి అని చిన్మయి పేర్కొన్నారు. చిన్మయి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

చిన్మయి కామెంట్ల గురించి అంజలి నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. బాలయ్య మాత్రం ఈ వివాదం గురించి ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. బాలయ్య పుట్టినరోజుకు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. బాలయ్య బాబీ కాంబో మూవీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.