March 20, 202511:46:30 PM

Mahesh Babu: నాన్నను తలచుకుంటూ మహేష్ ఎమోషనల్ పోస్ట్.. జ్ఞాపకాల్లో ఉంటావంటూ?

సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ (Krishna) తన సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకోగా ఆయన ఖాతాలో ఎన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. కృష్ణ భౌతికంగా దూరమైనా కోట్ల సంఖ్యలో అభిమానుల హృదయాల్లో మాత్రం ఆయన జీవించే ఉన్నారు. ఈరోజు కృష్ణ పుట్టినరోజు కాగా తండ్రిని తలచుకుంటూ మహేష్ బాబు (Mahesh Babu) ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఈరోజు కృష్ణగారి 81వ పుట్టినరోజు కాగా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టగా కృష్ణ పోస్ట్ లో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. “హ్యాపీ బర్త్ డే నాన్నా.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను.. కానీ నువ్వు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటావు” అంటూ మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కృష్ణ ఫోటోను షేర్ చేస్తూ మహేష్ బాబు ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ పోస్ట్ చేయడం జరిగింది.

సాధారణంగా కృష్ణగారి పుట్టినరోజున మహేష్ బాబు సినిమాలకు సంబంధించి ఏవైనా అప్ డేట్స్ వచ్చేవి. అయితే మహేష్ రాజమౌళి (Rajamouli) కాంబో మూవీ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. మహేష్ జక్కన్న కాంబో మూవీ రిలీజ్ కావడానికి మరో రెండేళ్ల సమయం ఉన్నా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

భారతీయ సినీ చరిత్రలో బడ్జెట్ పరంగా కూడా ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఈ సినిమా కోసం గత సినిమాలతో పోల్చి చూస్తే మరింత ఎక్కువగా కష్టపడుతున్నారు. ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకోవడానికి జక్కన్న రేయింబవళ్లు కష్టపడుతున్నారని కామెంట్లు జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.