
కొరటాల శివ (Koratala Siva) .. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. ‘మిర్చి’ (Mirchi) ‘శ్రీమంతుడు’ (Srimanthudu) ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఆ 4 బ్లాక్ బస్టర్స్ క్రెడిట్ ని.. ‘ఆచార్య’ (Acharya) పడగొట్టేసినట్టు అయ్యింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. లీగల్ గా కొరటాల చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా కొరటాల గ్రాఫ్ పడిపోయింది అనుకున్న టైంలో ఎన్టీఆర్ (Jr NTR) అతనికి ఛాన్స్ ఇచ్చాడు.
‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ‘దేవర’ (Devara) రూపంలో కొరటాలపై పెద్ద బాధ్యతే పడినట్టు అయ్యింది. పైగా ‘ఆచార్య’ ఫలితాన్ని మరిపించాల్సిన టైం కూడా..! అయితే కొరటాలపై ఎప్పుడూ ఓ కంప్లైంట్ ఉంటుంది. ఒకటి అతను కథలు దొబ్బేస్తాడని, ఇంకోటి.. పాత సినిమాలని అటూ ఇటూ తిప్పి మళ్ళీ తీస్తాడు అనేది ఆ కంప్లైంట్.’శంఖం’ (Sankham) చిత్రాన్ని మార్చి ‘మిర్చి’ గా, బాలకృష్ణ (Balakrishna) ‘జననీ జన్మభూమి’ ని ‘శ్రీమంతుడు’ గా, ‘గాడ్ ఫాదర్’ ని ‘జనతా గ్యారేజ్’ గా, ‘లీడర్’ (Leader) ని ‘భరత్ అనే నేను’ గా తీసి హిట్లు కొట్టాడు అని.! ‘ఆచార్య’ కథ విషయంలో కూడా అతను చాలా వివాదాలు ఫేస్ చేశాడు.
ఇప్పుడు ‘దేవర’ కథ పై కూడా కొన్ని చర్చలు మొదలయ్యాయి. ఓ 10 ఊర్లకి కాపరిగా ఎన్టీఆర్ కనిపిస్తాడని ఈ సినిమాలో నటించిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ చెప్పుకొచ్చాడు. ‘కాపరి’ అనే పదాన్ని, ఎన్టీఆర్ పాత్రని.. ‘ఆర్.ఆర్.ఆర్’ లో రాజమౌళి (S. S. Rajamouli) బాగా ఎలివేట్ చేసాడని.. సో దానినే కొరటాల ‘దేవర’ లో హైలెట్ చేస్తున్నాడని అంతా చెప్పుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే ‘నరసింహుడు’ (Narasimhudu) లో కూడా ఎన్టీఆర్ పాత్ర ఇలానే ఉంటుంది.
ఓ ఊరి కోసం ఎన్టీఆర్ అండగా నిలబడతాడు. 365 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఇంట్లో ఉంటూ… వాళ్లకి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుంది. ‘దేవర’ లో కూడా అలాగే ఉంటుంది అనే డిస్కషన్స్ ఇప్పుడు ఊపందుకున్నాయి. కొరటాలలో ఒక టాలెంట్ ఉంది. పాత కథని తీసుకున్నా.. హీరోకి ఎలివేషన్ సీన్లు బాగా రాసుకుంటాడు. అది కనుక వర్కౌట్ అయితే ‘దేవర’ గట్టెక్కేసే ఛాన్స్ ఉంది.