March 22, 202502:34:53 AM

Dhanush: ధనుష్.. మరో క్రేజీ తెలుగు ప్రాజెక్ట్..!

ఈ మధ్య పక్క భాషలకు చెందిన స్టార్ హీరోలు తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఆల్రెడీ విజయ్ (Vijay Thalapathy) తో ‘వరిసు'(వారసుడు) (Varisu) అనే సినిమా చేశాడు. హను రాఘవపూడి (Hanu Raghavapudi) .. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తో ‘సీతా రామం’ (Sita Ramam) అనే బ్లాక్ బస్టర్ మూవీ చేశాడు. వెంకీ అట్లూరి (Venky) ధనుష్ (Dhanush) తో ‘సార్’ (Sir) అనే సూపర్ హిట్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. మన స్టార్ హీరోలు ఖాళీగా లేకపోవడం వల్లే వీళ్ళు పక్క భాషల స్టార్ హీరోలను సంప్రదించి ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నారు అని చెప్పవచ్చు.

మరో పక్క పక్క భాషల స్టార్ హీరోలు కూడా టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తే తెలుగులో వారి మార్కెట్ స్ట్రాంగ్ అవుతుంది అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ లిస్ట్ లో ధనుష్ ఫస్ట్ ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే తమిళంలో అతని సినిమాలు ఎంత సూపర్ హిట్ అయినప్పటికీ.. తెలుగులో సత్తా చాటినవి ఎక్కువ లేవు. ‘సార్’ తో అతనికి తెలుగులో మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ‘కుబేర’ కూడా చేస్తున్నాడు.

దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరోపక్క దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో కూడా మరో తెలుగు ప్రాజెక్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ‘శ్రీకారం’ (Sreekaram) దర్శకుడు కిషోర్ (Kishore Reddy) ధనుష్ కి ఓ కథ వినిపించాడట. అది ధనుష్ కి బాగా నచ్చింది. అందుకే వెంటనే ఓకే చెప్పేసినట్టు సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది అని తెలుస్తుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.