March 22, 202507:40:01 AM

Eagle Collections: ‘ఈగల్’ ఫైనల్ గా ఎంత వరకు కలెక్ట్ చేసిందంటే?

మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’ (Eagle) . అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ,కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) దర్శకుడు. ‘ధమాకా’ తర్వాత ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో రవితేజ చేస్తున్న మూవీ ఇది. దీంతో ‘ఈగల్’ పై మంచి అంచనాలే ఉన్నాయి.ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ ,ట్రైలర్స్, పాటలు పాజిటివ్ రెస్పాన్స్ ని రాబట్టుకున్నాయి. మొదటి రోజు ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది.

ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది.తర్వాత కోలుకుంది అంటూ లేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.74 cr
సీడెడ్ 2.00 cr
ఉత్తరాంధ్ర 1.75 cr
ఈస్ట్ 1.16 cr
వెస్ట్ 0.70 cr
గుంటూరు 1.15 cr
కృష్ణా 0.80 cr
నెల్లూరు 0.58 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.88 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.36 cr
 ఓవర్సీస్ 1.70 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 15.94 cr (షేర్

‘ఈగల్’ కి రూ. 22.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ రూ.22.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.15.94 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.6.36 కోట్ల నష్టాలను మిగిల్చి ప్లాప్ గా మిగిలింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.