March 23, 202501:32:01 AM

Ambajipeta Marriage Band Collections: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే ?

సుహాస్ (Suhas) హీరోగా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) సినిమా రూపొందింది. ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కి ముందు విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.శేఖర్ చంద్ర (Shekar Chandra) ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అలాగే టీజర్, ట్రైలర్స్ .. కూడా మంచి మార్కులు వేయించుకున్నాయి. ‘జి ఎ 2 పిక్చర్స్’ ‘ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్’ ‘మహాయాన మోషన్ పిక్చర్స్’ సంస్థల పై ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilneni) ఈ చిత్రాన్ని నిర్మించగా ‘బన్నీ వాస్’ (Bunny Vasu) ‘వెంకటేష్ మహా’ (Venkatesh Maha) సమర్పకులుగా వ్యవహరించారు.

దుష్యంత్ కటికనేని (Dushyanth Katikaneni) ఈ చిత్రానికి దర్శకుడు. తొలిరోజు ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  1.48 cr
సీడెడ్  0.51 cr
ఆంధ్ర(టోటల్)  1.77 cr
ఏపీ + తెలంగాణ  3.76 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.39 cr
ఓవర్సీస్   0.62 cr
వరల్డ్ వైడ్ టోటల్   4.77 cr

‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ చిత్రం రూ.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.4.77 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ మూవీ ఇంకో రూ.1.77 కోట్ల లాభాలను అందించి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.