March 26, 202508:53:04 AM

Gam Gam Ganesha: ‘గం గం గణేశ్‌’… దర్శకుడి బ్యాగ్రౌండ్‌ తెలుసా? ఆయన దగ్గర…

‘బేబీ’ (Baby) సినిమా ఎప్పుడు వచ్చిందో గుర్తుందా? ఇప్పుడు ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha) వచ్చేసింది కదా.. ఇప్పుడు ఆ పాత సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఉందీ.. లింక్‌ ఉంది. అదేంటంటే.. ఆ సినిమా ఎప్పుడు షూటింగ్‌ చేశారో? ఇప్పుడు ‘గం గం గణేశా’ కూడా అప్పుడే షూట్‌ చేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ఉదయ్‌ బొమ్మిశెట్టి తెలిపారు. రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కడంతో ఆనంద్‌ (Anand Deverakonda) చాలా కష్టపడి డిఫరెన్స్‌ చూపించాడు అని తెలిపారు.

భయం, అత్యాశ, కుట్ర కొందరు మనుషుల్ని ఎలా మార్చేస్తుంది అనే అంశంతో ‘గం.. గం.. గణేశా’ తెరకెక్కించారు. గణేష్‌ నవరాత్రుల సమయంలో జరిగే కథ ఇది. ఓ గణేశుడి విగ్రహం చుట్టూ ఈ కథ తిరుగుతుంది,. ఈ చిత్రంలో హీరోయిన్‌ మాత్రమే మంచి వ్యక్తి. మిగిలిన అందరూ దొంగలే. ఇలాంటి కాన్సెప్ట్‌తో అంటే దాదాపు అందరూ గ్రే షేడ్‌లో కనిపించడం కొత్త విషయమే కదా. ఇక అనుకున్న సమయానికి సినిమా తెరపైకి రాలేదు.

ఎప్పుడో పూర్తయిన ఈ సినిమాను వివిధ కారణాల వల్ల వాయిదా వేస్తూ వేస్తూ రెండేళ్ల తర్వాత రిలీజ్‌ చేశారు. ‘బేబీ’ సినిమాకు పారలల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినా ఆలస్యమైంది. ఇక పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) స్ఫూర్తితో దర్శకుడిగా మారానని దర్శకుడు ఉదయ్‌ చెబుతున్నారు. డిగ్రీ అవ్వగానే సినిమాల్లోకి వచ్చేశారాయన. తొలి రోజుల్లో రచయిత విజయేంద్రప్రసాద్‌ దగ్గర పని చేశారు.

ఇక ఉదయ్‌కి రాజమౌళి (S. S. Rajamouli) సినిమాల్లోని డ్రామా అంటే బాగా ఇష్టట. అలాంటి డ్రామాతో మంచి యాక్షన్‌ సినిమా చేయాలని ఉందని చెబుతున్నారు. అంతేకాదు తన తదుపరి చిత్రం అలాంటి యాక్షన్‌ డ్రామా కథతోనే ఉంటుంది అని చెప్పేశారు. ఇక ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కేదార్‌ విజయ్‌ దేవరకొండకు (Vijay Devarakonda)  దగ్గరి వ్యక్తి. విజయ్‌ – సుకుమార్‌ (Sukumar) కాంబినేషన్‌లో ఓ సినిమాను గతంలో అనౌన్స్‌ చేశారు కూడా. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్‌ ఇప్పటివరకు మెటీరియలైజ్‌ అవ్వలేదు.

 

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.