Game Changer: గేమ్‌ ఛేంజర్‌ నుండి కొత్త లీక్‌.. అదిరిపోయిన చరణ్‌ లుక్‌!

రామ్‌చరణ్‌ (Ram Charan) – దిల్‌ రాజు (Dil Raju) – శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) . దిల్‌ రాజు బ్యానర్‌ మీద ప్రతిష్ఠాత్మక 50వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో కొన్ని లీకులు ఇబ్బందిపెట్టాయి కూడా. ఆ సంగతేదో తేల్చుకుని కొత్త షెడ్యూల్ ప్రారంభించుకున్న టీమ్‌కు మరోసారి లీకుల సమస్య వచ్చింది. తాజాగా సినిమా షూటింగ్‌ నుండి ఓ 16 సెకన్ల వీడియో లీక్‌ అయ్యింది.

రామ్‌చరణ్‌, శ్రీకాంత్‌ (Srikanth) ఓ వేదిక మీద ఆలింగనం చేసుకుని, ఆ తర్వాత ప్రజలకు అభివాదం చేసే సన్నివేశమిది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌, శ్రీకాంత్‌ నిన్నటితరం రాజకీయ నాయకులుగా కనిపిస్తారని, ఇప్పటికే వార్తలొచ్చాయి. దీనికి సంబంధించి కొన్ని లుక్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. తాజాగా ఈ వీడియోతో ఆ విషయంలో స్పష్టత వచ్చేసింది. మరి ఈ వీడియోపై టీమ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరోవైపు సినిమా కొత్త షెడ్యూల్‌ రాజమహేంద్రవరంలో ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నారట. సినిమా ఫ్లాష్‌ బ్యాక్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించే షెడ్యూల్‌ ఇదే అని సమాచారం. గతంలోనూ సినిమా టీమ్‌ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో నడుస్తుంది. 2021లో లాంచ్‌ అయిన ఈ సినిమా ఇంకా షూటింగ్‌ దశలో ఉంది. సినిమా మొదలైన కొన్ని రోజులకు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ‘విక్రమ్‌’ (Vikram) సినిమా వచ్చి భారీ విజయం అందుకుంది.

దీంతో ఆయన ఆగిపోయిన ‘భారతీయుడు 2’ (Bharateeyudu -2) మళ్లీ పట్టాలెక్కిద్దాం అన్నారు. ఏమైందో ఏమో ‘భారతీయుడు 3’ కూడా పనిలో పనిగా తీసేశాం అని టీమ్‌ చెబుతోంది. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో చిన్న చిన్న షెడ్యూల్స్‌ షూటింగ్‌ చేసినా.. ఇప్పుడు మాత్రం ఫుల్‌ స్పీడ్‌లో షూటింగ్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. త్వరలో రిలీజ్‌ డేట్ కూడా చెబుతారట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.