April 10, 202507:04:39 PM

Gangs of Godavari: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

విశ్వక్ సేన్   (Vishwak Sen) హీరోగా నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్ గా అంజలి (Anjali) కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari)  . కృష్ణ చైతన్య (Krishna Chaitanya)  ఈ చిత్రానికి దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలు.. వంటివి బాగున్నాయి. పైగా విశ్వక్ సేన్ వరుస హిట్లతో ఫామ్లో ఉన్నాడు. అందువల్ల ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

దానికి తగ్గట్టే బిజినెస్ కూడా బాగా జరిగింది. ఒకసారి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ థియేట్రికల్ బిజినెస్, అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ వంటి వివరాలు గమనిస్తే :

నైజాం 4.00 cr
సీడెడ్ 1.20 cr
ఆంధ్ర(టోటల్) 4.20 cr
ఏపీ + తెలంగాణ 9.40 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.50 cr
ఓవర్సీస్ 10.90 cr

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రానికి రూ.10.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.11.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. విశ్వక్ సేన్ గత చిత్రాలు అయిన ‘దాస్ క ధమ్కీ’ (Das Ka Dhamki) ‘గామి’ (Gaami) చిత్రాలు.. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.11 కోట్ల వరకు షేర్ ను రాబట్టాయి. సో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టార్గెట్ ఈజీనే అని చెప్పాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.