March 21, 202501:10:56 AM

Kalki 2898 AD: ‘కల్కి’ సినిమా.. ఇప్పటివరకు ఇలా ఎవరూ ప్రొడ్యూస్‌ చేయలేదేమో!

దేశంలో అత్యంత పెద్ద బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) . ఈ సినిమా ప్రచారం జరగడం లేదు, తక్కువగా చేస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి, సినిమాను ప్రజల్లోకి భారీగా తీసుకెళ్లడానికి టీమ్‌ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా టీమ్‌ ఓ యానిమేషన్‌ సిరీస్‌ను రిలీజ్‌ చేసింది. ‘బుజ్జి అండ్‌ భైరవ’ అంటూ ఓ యానీ సిరీస్‌ రిలీజ్‌ చేసి అదరగొట్టింది.

ఈ రోజు నుండి సిరీస్‌ స్ట్రీమింగ్‌ మొదలైంది. రెండు ఎపిసోడ్‌లు ‘క్రాష్‌ అండ్‌ బర్న్‌’, ‘పార్టనర్స్‌’ స్ట్రీమ్‌ చేశారు. వాటికి మంచి ఆదరణ వస్తోంది. వీటి గురించి ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin)  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం వైజయంతీ మూవీస్ ఒక్కటే కాదు.. వైజయంతీ ఆటోమొబైల్స్, వైజయంతీ యానిమేషన్‌ అనే మూడు డిఫరెంట్‌ కంపెనీల్ని పని చేశాయి అని చెప్పారు. అంటే ఈ సినిమా మూడు సంస్థల సినిమా అని చెప్పొచ్చు.

ఈ సినిమా బుజ్జి అనే ఓ స్పెషల్‌ కారును చిత్రబృందం తయారు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఆనంద్‌ మహీంద్రా టీమ్‌తో కలసి వైజయంతీ ఆటోమొబైల్స్‌ టీమ్‌ పని చేసింది అని ఇప్పటికే తెలిపారు. అయితే అప్పుడు వైజయంతి మూవీస్‌ టీమ్‌ అన్నారు కానీ.. ఇప్పుడు దానికో పేరు పెట్టారు. ఇక యానిమేషన్‌ కోసం వైజయంతి యానిమేషన్‌ పెట్టారు. ‘బి అండ్‌ బి’ సిరీస్‌లో అదేనండీ ‘బుజ్జి అండ్‌ భైరవ’ సిరీస్‌లో రెండు ఎపిసోడ్లు ఇప్పుడు రాగా.. ఇంకో రెండు సినిమా రిలీజ్‌ అయ్యాక వస్తాయట.

ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదల నెలల నుంచి రోజుల్లోకి మారిపోయింది. జూన్ 27న సినిమా రిలీజ్‌ చేస్తున్న నేపథ్యంలో మరో నాలుగైదు రోజులలో ప్రచారాన్ని ఇంకాస్త జోరుగా ప్రచారం చేస్తారు. రెండేళ్ల క్రితం మాకు యానిమేషన్‌ ఆలోచన వచ్చినప్పుడు.. ఇంత కష్టంగా ఉంటుందని టీమ్‌ అనుకోలేదట. ఆ తర్వాత ‘ఛోటా భీమ్‌’ లాంటి యానిమేషన్‌ సిరీస్‌లను రూపొందించిన గ్రీన్‌ గోల్డ్‌తో కలసి ఈ సిరీస్‌ చేశామని నాగ్‌ అశ్విన్‌ చెప్పారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.