March 16, 202511:32:09 AM

Kalki, Devara: ఆ రెండు సినిమాలపై పరుచూరి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) కల్కి (Kalki) , దేవర (Devara) సినిమాల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో నన్ను పెదనాన్న అని పిలిచేది ప్రభాస్ (Prabhas) , ఎన్టీఆర్ (Jr NTR) మాత్రమేనని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. గతంలో కొంతమంది హీరోలు ఏడాదికి ఆరు, ఏడు సినిమాలు చేసేవారని ఆయన తెలిపారు. కృష్ణ అయితే ఏకంగా ఏడాదికి 12 సినిమాలు చేసేవారని పరుచూరి పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రెండ్ మారిందని భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయని పరుచూరి వెల్లడించారు.

అందుకే చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారని ఆయన అన్నారు. కల్కి మూవీ నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్ లో తెరకెక్కుతోందని కమల్ (Kamal Haasan) , అమితాబ్ (Amitabh Bachchan) ఈ సినిమాలో నటిస్తున్నారని పరుచూరి వెల్లడించడం గమనార్హం. ప్రభాస్ తో (Prabhas)  పాటు కమల్, అమితాబ్ స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లో కూర్చోగలరా అనిపిస్తుందని ఆయన అన్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎగిరి గంతులేయడం ఖాయమని పరుచూరి చెప్పుకొచ్చారు. ప్రభాస్ ది పసిపిల్లాడి మనస్తత్వం అని పరుచూరి చెప్పుకొచ్చారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఎత్తుకు ఎదిగారో తలచుకుంటే ఆనందంగా ఉందని పరుచూరి అన్నారు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో రానున్నారని ఇందులో తారక్ గెటప్ చూస్తే ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నాడని పరుచూరి చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో చాలామంది స్టార్ హీరోలు నటిస్తున్నారని ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని పరుచూరి తెలిపారు.

కల్కి, దేవర సినిమాలు టాలీవుడ్ సినిమాల ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలు భారీ హిట్స్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్ కు ఫిదా అవుతున్నామని ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.