March 16, 202511:51:39 AM

Krishnamma Collections: ‘కృష్ణమ్మ’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

సత్యదేవ్ (Satyadev)  హీరోగా కొరటాల శివ (Koratala Siva) సమర్పణలో ‘కృష్ణమ్మ’ (Krishnamma) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ళ క్రితం అంటే 2007 లో ఆయేషా అనే ఓ మైనర్ బాలిక హత్య ఉదంతం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. మే 10 న రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది.

అయితే బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రమే పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.19 cr
సీడెడ్ 0.09 cr
ఉత్తరాంధ్ర  0.13 cr
ఈస్ట్ 0.04 cr
వెస్ట్ 0.02 cr
గుంటూరు 0.03 cr
కృష్ణా 0.08 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.61 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.03 cr
 ఓవర్సీస్ 0.07 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.71 cr (షేర్)

‘కృష్ణమ్మ’ రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి కేవలం రూ.0.71 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.29 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేసి రెండో వీకెండ్ ను క్యాష్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉంటుంది. లేదంటే కష్టమే..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.