March 16, 202507:35:11 AM

Jr NTR: సెప్టెంబర్ నెలలో విడుదలైన ఎన్టీఆర్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

సినీ పరిశ్రమ అంటేనే సెంటిమెంట్లతో నిండి ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పటి నుండి గుమ్మడికాయ కొట్టే వరకు మేకర్స్ మాత్రమే కాదు అభిమానులకి కూడా రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. వాటిని కొంతమంది ‘మిత్'(MYTH) అని కూడా అంటుంటారు. ఇక మరికొన్ని గంటల్లో అంటే సెప్టెంబర్ 27న ‘దేవర’ (Devara) చిత్రం మొదటి భాగం విడుదల కాబోతుంది. ఇప్పుడు అంతా ఈ సినిమా గురించే ఎక్కువ డిస్కషన్స్ నడుస్తున్నాయి. కొరటాల (Koratala Siva)  డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni)  నిర్మించాడు. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సహా నిర్మాతగా వ్యవహరించాడు.

Jr NTR

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే అభిమానులను కొన్ని సెంటిమెంట్లు వెంటాడుతున్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్  (Jr NTR)  నుండి రాబోతున్న సినిమా ఈ ‘దేవర’. సహజంగా రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో ఏ హీరో సినిమా చేసినా.. ఆ హీరో నెక్స్ట్ సినిమా ప్లాప్ అవుతూ వస్తోంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కలవరపడుతున్నారు. అయితే ఓ సెంటిమెంట్ ను బట్టి అయితే ‘దేవర’ సూపర్ హిట్ అవ్వాలి అనేది మరికొందరి మాట.

Jai Lava Kusa

అదేంటంటే.. సెప్టెంబర్ నెలలో ఎన్టీఆర్ (Jr NTR) నటించిన సినిమా రిలీజ్ అయితే మంచి విజయాన్ని అందుకుంటాయట. గతంలో చూసుకుంటే.. ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ (Student No: 1) చిత్రం 2001 సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. రాజమౌళి ఆ చిత్రానికి దర్శకుడు. తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన మొదటి సినిమా ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage)  కూడా సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ అయ్యింది.

2016 సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన ఆ చిత్రం అప్పటికి ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ ని సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 2017 సెప్టెంబర్ 21న రిలీజ్ అయిన ‘జై లవ కుశ’ (Jai Lavakusa) కూడా రిలీజ్ అయ్యి.. మంచి ఫలితాన్నే అందుకుంది. సో ఎన్టీఆర్ .. సెప్టెంబర్ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. ఆ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ‘దేవర’ కూడా మినిమమ్ గ్యారంటీ అవ్వాలి.

గోపీచంద్ ‘లౌక్యం’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే…!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.