March 20, 202507:04:17 PM

Krishnamma: ఆ తప్పు చేయడం వల్ల కొరటాల శివకు భారీగా నష్టం వచ్చిందా?

మిర్చి (Mirchi) , శ్రీమంతుడు (Srimanthudu) , జనతా గ్యారేజ్ (Janatha Garage) , భరత్ అనే నేను (Bharat Ane Nenu) సినిమాలతో కొరటాల శివ (Koratala Siva)  బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ఆచార్య (Acharya) సినిమా మాత్రం కొరటాల శివ కెరీర్ కు మైనస్ గా మారింది. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో పాటు కొరటాల శివ డైరెక్షన్ స్కిల్స్ పై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే కొరటాల శివ నిర్మాతగా తెరకెక్కిన కృష్ణమ్మ (Krishnamma) మూవీ రిలీజైన వారానికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఆచార్య సినిమా రిలీజ్ కు ముందే కృష్ణమ్మ మూవీ డిజిటల్ రైట్స్ కు ఏకంగా 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఆఫర్ వచ్చిందట. అయితే ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల కొరటాల శివ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని సమాచారం అందుతోంది. ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివకు కొంతమేర క్రేజ్ తగ్గడంతో ఆయన నిర్మించిన కృష్ణమ్మ సినిమాకు సైతం డిజిటల్ రైట్స్ ఆఫర్ తగ్గుతూ వచ్చిందని భోగట్టా.

కృష్ణమ్మ థియేట్రికల్ రైట్స్ ను కొరటాల శివ 3 కోట్ల రూపాయలకు విక్రయించారని రిలీజైన వారానికే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తే ఒకింత ఎక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉండటంతో ఈ సినిమాను వారం రోజులకే స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కొరటాల శివ దేవరతో సక్సెస్ అందుకుంటే ఈ పరిస్థితి మారుతుంది.

దేవర (Devara) సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరురుగుతుండగా దేవర ఫియర్ సాంగ్ తెలుగు వెర్షన్ కు 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇతర భాషల్లో సైతం దేవర ఫస్ట్ సింగిల్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. “దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక రగిలిన కోపమే మృత్యువుకైనా ముచ్చెమట” అనే లైన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.