March 21, 202502:33:42 AM

Love Me Trailer Review: ‘లవ్ మీ’ ట్రైలర్.. బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి.!

‘బలగం’ (Balagam) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి (Harshith Reddy) , హన్షిత రెడ్డి (Hanshitha Reddy) నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ మీ’ (Love Me). అరుణ్ భీమవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) సంగీత దర్శకుడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ (P. C. Sreeram) అందిస్తుండటం మరో విశేషంగా చెప్పుకోవాలి. మే 25 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ‘లవ్ మీ’ ట్రైలర్ విషయానికి వస్తే..

ఇది 2 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఈ ట్రైలర్ ని గమనిస్తే.. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు అలారం మోగడం. దాని గురించి ఆలోచించి ఆ ఊర్లో జనాలు భయపడుతుండటం వంటివి జరుగుతాయి. అది ఆ ఊరిని పట్టి పీడిస్తున్న దెయ్యం కోసం అని అంతా అనుకుంటారు. మరోపక్క హీరో ఇంట్రడక్షన్. అర్జున్ అనే పాత్రలో ఆశిష్ (Ashish Reddy) కనిపించబోతున్నాడు. అతను ‘దిల్’ సినిమాలో నితిన్ టైపు. ఎవరైనా ఏదైనా చేయొద్దు అంటే అతను అదే చేస్తుంటాడు.

అదే విధంగా దివ్యవతి అనే దెయ్యం జోలికి వెళ్లొద్దు అంటే.. అతను దాని జోలికి వెళ్తాడు. ఈ క్రమంలో ఆ దెయ్యాన్ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఆ దివ్యవతి అనే దెయ్యం అతన్ని ఎలా ట్రీట్ చేసింది? ఆమె గతం ఏంటి? అనే సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. చెప్పాలంటే ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.