March 22, 202501:42:18 AM

Love Me: ‘లవ్ మీ’ విషయంలో దిల్ రాజు స్ట్రాటజీ అదే..!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju ) చిన్న సినిమాలతోనే భారీ సక్సెస్…లు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే పెద్ద సినిమాల నిర్మాణంలో బిజీగా ఉంటున్న తరుణంలో చిన్న సినిమాలపై సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నట్టు ఆయన పలుమార్లు చెప్పుకొచ్చారు. ఆ టైంలో ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ ను స్థాపించి.. దాని చిన్న సినిమాలు నిర్మించాలని ఆయన డిసైడ్ అయ్యారు. దీని బాధ్యతల్ని ఆయన కూతురు హన్షిత రెడ్డి  (Hanshitha Reddy)  , తమ్ముడి కొడుకు హర్షిత్ రెడ్డి(Harshith Reddy) ..లకి అప్పగించారు.

తొలి ప్రయత్నంగా ‘బలగం’ (Balagam) చేశారు. రూ.4.5 కోట్ల బడ్జెట్ తో చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి.. మంచి లాభాలను తెచ్చిపెట్టింది.అనేక అవార్డులు కూడా లభించాయి. అయితే పెద్దగా గుర్తింపు లేని నటీనటులతో చేసిన ఈ సినిమా ఆ స్థాయిలో విజయం సాధిస్తుంది అని మొదట చాలా మందికి నమ్మకం లేదు. అంతెందుకు దిల్ రాజుకే నమ్మకం లేదన్నట్టు ఆయనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఇదే బ్యానర్లో ‘లవ్ మీ’ (Love Me) అనే సినిమా కూడా రూపొందింది.

ఈ సినిమా విషయంలో కూడా దిల్ రాజు కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ‘బలగం’ ఓటీటీ బిజినెస్ సినిమా రిలీజ్ తర్వాత జరిగింది. రిలీజ్ కి ముందు బిజినెస్ జరగలేదు. ఇప్పుడు ‘లవ్ మీ’ కి కూడా అదే పరిస్థితి. అయినప్పటికీ దిల్ రాజు టెన్షన్ పడట్లేదట.కచ్చితంగా ‘బలగం’ లానే మంచి రేటు వస్తుంది అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ‘ఆహా’ వారితో డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీనికే ఫైనల్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అని వినికిడి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.