March 23, 202506:19:22 AM

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు డబుల్ బొనాంజా..?

మే 31 .. మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులకి చాలా స్పెషల్. ఎందుకంటే ఆ రోజు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ (Krishna) గారి జయంతి. మహేష్ బాబు… తన సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఆ రోజు అనౌన్స్ చేయించుకుంటారు. అది ఆయనకు సెంటిమెంట్. అందుకే మహేష్ అభిమానులకి ఆ డేట్ చాలా అంటే చాలా స్పెషల్. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి (S. S. Rajamouli) సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కథాచర్చలు అన్నీ కంప్లీట్ అయ్యాయి.

ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే అనౌన్స్మెంట్ ఇంకా ఇవ్వలేదు. పలు ఈవెంట్స్ లో రాజమౌళి స్వయంగా ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు కానీ.. అధికారిక ప్రకటన రాలేదు. కృష్ణ గారి జయంతి రోజు అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని టీం చెబుతుంది. ‘ఎస్.ఎస్.ఎం.బి 29 ‘ గా ఈ ప్రాజెక్టు రూపొందనుంది. అయితే అదే రోజు మహేష్ బాబు 30 వ సినిమా గురించి అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయట.

మహేష్ తో సినిమా చేయాలని అనిల్ రావిపూడి (Anil Ravipudi), కొరటాల శివ (Koratala Siva).. చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళలో ఒకరితో మహేష్ 30 వ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఆ తర్వాత త్రివిక్రమ్ (Trivikram) లేదా సుకుమార్ (Sukumar) తో ఇంకో సినిమా చేయడానికి కూడా మహేష్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు టాక్. మొత్తానికి ఈ మే 31 మహేష్ అభిమానులకు మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది అని స్పష్టమవుతుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.