Nagarjuna: నాగార్జున సినిమాలో ఆ బాలీవుడ్ విలన్‌.. ఎందుకో ఈ మేనియా!

వేలంవెర్రి అని అంటుంటారు. మీరు కూడా ఈ మాట వినే ఉంటారు. అంటే ఒకరు ఏదైనా చేస్తే ఇక అందరూ అదే పని చేస్తారు. దీనిని సినిమాలకు ఆపాదించి మాట్లాడితే.. ఒకరు ఎలాంటి కథ ఎంచుకుంటే మిగిలిన హీరోలు అలాంటి ఆలోచనలే చేస్తారు. దీనికి మరో ఉదాహరణ కావాలంటే ఒక సినిమాకు చేసిన విలన్‌ను ఆ తర్వాత వరుస సినిమాలకు తీసుకుంటూ ఉంటారు. అయితే ఫస్ట్‌ టైమ్‌ విలన్‌గా చేసిన సినిమా భారీ విజయం సాధించి ఉండాలి. ఈ పాటికే మీకు అర్థమైపోయుంటుంది మేం చెబుతున్నది బాలీవుడ్‌ స్టార్‌ విలన్‌ బాబీ డియోల్‌ (Bobby Deol) గురించి అని.

నాగార్జున (Nagarjuna) – నవీన్‌ – స్టూడియో గ్రీన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. త్వరలో ప్రారంభమవుతుంది అని అంటున్న ఈ సినిమాలో విలన్‌ ఎవరు అనే విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ బాబీ డియోల్‌ను ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం మాట్లాడుతున్నారట. నాగ్‌ను ఢీ కొట్టే శక్తిమంతమైన పాత్రలో ఆయనైతే బాగుంటాడు అని టీమ్‌ అనుకుంటోందట. ‘యానిమల్‌’లో (Animal) అతని నటన చూశాక ఎవరైనా ఇదే మాట అంటారులెండి.

జూన్‌ నెలాఖరు నుండి ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ ఉంటుంది అంటున్నారు. అప్పుడు ఇంకాస్త క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఇదే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అని కూడా అంటున్నారు. ఆ విషయం కూడా త్వరలో తేలిపోతుంది అని టాక్‌. పైన చెప్పినట్లు ఇప్పుడు సౌత్‌లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాల్లో బాబీనే మెయిన్‌ ప్రొటాగనిస్ట్‌గా కనిపించబోతున్నాడు.

పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు’  (Hari Hara Veera Mallu)  సినిమాలోను, బాలకృష్ణ – బాబీ సినిమాలో, సూర్య (Suriya) – శివ (Siva) ‘కంగువ’లో (Kanguva) బాబీనే విలన్‌. దీంతో బాబీనే పెద్ద సినిమాల ఛాయిస్‌ అవుతున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవే కాదు మరికొన్ని సినిమాలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయనే వార్తలు రావడమే ఆ మాటలకు కారణం. చూద్దాం ఇంకా ఏ సినిమాలు వస్తాయో ఆయన ఖాతాలోకి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.