March 22, 202507:11:34 AM

Nandamuri Heroes: నందమూరి హీరోలు అక్కడ దృష్టి పెట్టాల్సిందేనా.. ఫ్యాన్స్ అభిప్రాయమిదే!

నందమూరి హీరోలకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. బాలయ్య (Nandamuri Balakrishna) , జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వరుస విజయాలతో కెరీర్ కొనసాగిస్తుండగా కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సక్సెస్ ఫెయిల్యుర్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే నందమూరి హీరోలు సోషల్ మీడియాపై మరింత ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి ఉందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయకు ఫేస్ బుక్ లో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా తారక్ కు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయితే ఈ హీరోలు తమ సినిమాలకు సంబంధించి, వ్యక్తిగత విషయాలకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అభిమానులతో అభిప్రాయాలను పంచుకుంటున్నారు. నందమూరి హీరోలు ఇప్పటికైనా సోషల్ మీడియాపై మరింత దృష్టి పెట్టి ఈ దిశగా అడుగులు వేయాల్సి ఉంది. ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాల వల్ల బాలయ్య షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చినా బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవర (Devara) సినిమా పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

కళ్యాణ్ రామ్ మూవీ షూట్ సైలెంట్ గా జరుగుతోందని త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. నందమూరి హీరోలు కెరీర్ ను మాత్రం అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. నందమూరి హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.