Nayanthara: నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయన్.. రూపాయి కూడా తగ్గనంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని, కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో నయనతార (Nayanthara) ఒకరు కాగా రెమ్యూనరేషన్ ద్వారా నయనతార ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే కన్నడ సినిమాలో నయన్ కు అక్క రోల్ లో నటించే ఛాన్స్ రాగా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తాను అస్సలు తగ్గనని నయనతార వెల్లడించినట్టు తెలుస్తోంది. ఏ రోల్ అయినా పారితోషికం విషయంలో రూపాయి కూడా మార్పు ఉండదని ఆమె చెప్పినట్టు భోగట్టా. అయితే నిర్మాతలకు నయనతార చుక్కలు చూపిస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

నయనతార పారితోషికం తగ్గించకపోతే భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులు తప్పవని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. నయనతార ప్రస్తుతం ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తూనే మరోవైపు అగ్ర హీరోల సినిమాలలో నటించడానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని సమాచారం అందుతోంది. డియర్‌ స్టూడెంట్స్‌ అనే సినిమా కోసం తాను సాధారణంగా తీసుకునే పారితోషికంతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను ఆమె డిమాండ్ చేశారని సమాచారం అందుతోంది.

అక్క పాత్రకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకోవడం అంటే నయనతారకు మాత్రమే సాధ్యమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నయన్ తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో నయనతార కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాలలో చిక్కుకోవడం నయనతారకు మైనస్ అవుతోంది. డియర్ స్టూడెంట్స్ సినిమాలో నవీన్ పాలి మాస్ రోల్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.

నయనతార ఇతర భాషల్లో సైతం మరింత సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. నయనతార నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నయన్ సినిమా ప్రమోషన్స్ కు సైతం దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. వయస్సు పెరుగుతున్నా గ్లామరస్ గా కనిపిస్తుండటం నయనతారకు ఎంతగానో ప్లస్ అవుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.