Balakrishna: అక్కడ రేర్ రికార్డ్ సాధించిన బాలయ్య సినిమా.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో బాలయ్య (Nandamuri Balakrishna)  సినీ కెరీర్ లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. బాలయ్య సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆయన ఖాతాలో కొత్త రికార్డులు సులువుగా చేరుతుంటాయి. అఖండ (Akhanda) , వీరసింహారెడ్డి (Veera Simha Reddy) , భగవంత్ కేసరి (Bhagavath Kesari) సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి సినిమా విడుదలై 210 రోజులైనా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో ఈ సినిమా ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది. ఈ థియేటర్ లో 2006లో పోకిరి (Pokiri) సినిమా 200 రోజులు ప్రదర్శితం కాగా ఇప్పుడు భగవంత్ కేసరి 210 రోజులు ప్రదర్శితమైంది.

ఇలా ఈ థియేటర్ ఖాతాలో రెండు సినిమాలు అరుదైన ఘనతలను సాధించి వార్తల్లో నిలిచాయి. భగవంత్ కేసరి దాదాపుగా 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది. భగవంత్ కేసరి సినిమాలోని మెసేజ్ సైతం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలయ్య బాబీ కాంబో మూవీ సైతం బాలయ్య గత సినిమాలను మించి ఉండబోతుందని సమాచారం అందుతోంది.

బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ 100 కోట్ల రూపాయల కంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య బాబీ (Bobby) కాంబో సినిమా షూటింగ్ దాదాపుగా 40 శాతం పూర్తైందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. కనీసం 70 శాతం షూటింగ్ పూర్తైతే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

బాలయ్య మాస్, యాక్షన్ కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. బాలకృష్ణ క్రేజ్ పరంగా ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. బాలయ్య పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో ప్రాజెక్ట్ లను ప్రకటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య సినిమాలు ఈ జనరేషన్ యూత్ కు సైతం ఎంతో నచ్చుతున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.