Pawan Kalyan, Anna Lezhneva: పవన్ భార్య సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అటు పొలిటికల్ కెరీర్ పరంగా, ఇటు సినీ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే పవన్ భార్య అన్నా లెజినోవా సింప్లిసిటీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పవన్ భార్య ఎలాంటి ఆడంబరాలకు పోకుండా సగటు మహిళలా కనిపించడం గమనార్హం. అన్నా లెజినోవా సింగిల్ లైన్ తో ఉన్న మంగళ సూత్రంతో కనిపించడం గమనార్హం.

సింపుల్ కాటన్ శారీలో ఆమె కనిపించారు. పవన్ కళ్యాణ్ జనసేన నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయగా పవన్ కు అనుకూల ఫలితాలు రావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ లక్ష మెజారిటీతో గెలుస్తానని చెబుతుండగా ఆయన నమ్మకం నిజమవుతుందో లేదో తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఆగష్టు తర్వాతే షూటింగ్స్ తో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్ క్రేజ్ పరంగా ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. పవన్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఈ ఏడాదే రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. పవన్ ఇప్పట్లో కొత్త సినిమాలను ప్రకటించే అవకాశం కూడా లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ వేర్వేరు జానర్ల సినిమాలలో నటిస్తూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ సినిమాలన్నీ 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.