March 22, 202506:33:48 AM

Pawan Kalyan: పవన్ సినిమాలలో ఆ రెండు సినిమాలు అభిమానులకు సైతం నచ్చవా?

స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. పవన్ నటించిన కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ తో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ ఫీలవుతారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు నటించిన సినిమాలలో రెండు సినిమాలు ఫ్యాన్స్ కు సైతం నచ్చలేదు.

కొమరం పులి (Puli) , అజ్ఞాతవాసి (Agnyaathavaasi) సినిమాలు పవన్ కళ్యాణ్ అభిమానులను సైతం ఆకట్టుకోలేదు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా కూడా నష్టాలను మిగిల్చాయనే సంగతి తెలిసిందే. కొమరం పులి సినిమా ఎస్.జె.సూర్య (S. J. Suryah)  డైరెక్షన్ లో తెరకెక్కగా అజ్ఞాతవాసి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikrama) డైరెక్షన్ లో తెరకెక్కింది. పవన్ కు అటు సూర్య ఇటు త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్లను ఇవ్వడంతో పాటు ఈ సినిమాలతో డిజాస్టర్ సినిమాలను కూడా ఇచ్చారు.

కథనం విషయంలో చేసిన పొరపాట్ల వల్లే ఈ రెండు సినిమాలు నచ్చలేదని చాలామంది అభిమానులు చెబుతారు. కొమరం పులి సినిమా అప్పట్లో 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా అజ్ఞాతవాసి సినిమా మాత్రం ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని టాక్ ఉంది. అయితే అజ్ఞాతవాసి సినిమా ఫ్లాపైనా పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీ (Allu Arjun) సినిమాతో బిజీగా ఉండగా రాబోయే రోజుల్లో పవన్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. త్రివిక్రమ్ తలచుకుంటే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తి కావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.