Prabhas: బుజ్జిని పరిచయం చేయబోతున్న బుజ్జిగాడు… ఎవరబ్బా?

‘డార్లింగ్స్‌.. ఎట్టకేలకు మన జీవితంలోకీ ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్‌ చేయండి’ అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు ప్రభాస్‌ (Prabhas) . దీంతో అందరూ ఇన్‌స్టంట్‌గా అనుకున్న విషయం ‘డార్లింగ్‌ ఏమన్నా పెళ్లి కబురు చెప్పబోతున్నాడా?’ అని. కానీ అది పెళ్లి వార్త కాదు అని, సినిమా ప్రచారం అని కాసేపటికే అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి చేసిన మరో ట్వీటుతో క్లారిటీ వచ్చింది. అయితే మళ్లీ చిన్న కన్‌ఫ్యూజన్‌లో పెట్టారు.

‘డార్లింగ్స్‌.. నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ప్రభాస్‌ శుక్రవారం రాత్రి మరో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే, ఆ బుజ్జి ఎవరు అనేది తెలియడం లేదు. దీనికి కారణం సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. ఒకరు దీపిక పడుకొణె (Deepika Padukone)  కాగా, మరొకరు దిశా పటానీ (Disha Patani) . మరి ఈ సినిమాలో మన బుజ్జిగాడుతో బుజ్జి అని పిలిపించుకునే హీరోయిన్‌ ఎవరు అనేది కూడా తెలియాలి.

అయితే, ఇక్కడో ఇంకో డౌట్‌ కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌. ఏంటంటే.. అసలు బుజ్జి అంటే హీరోయినేనా? లేక ఇంకేదైనా పాత్రను అలా పిలుస్తారా? అని. మామూలుగానే ప్రభాస్‌ అందరినీ డార్లింగ్‌ అంటుంటాడు. ఇప్పుడు కమల్‌ హాసన్‌ను ఏమైనా బుజ్జి అని ముద్దుగా ఇలా పిలుస్తున్నాడా? అనే డౌట్‌ కూడా ఉంది. ఈ విషయంలో క్లారిటీ మరికాసేపట్లో వచ్చేస్తుంది. దీంతోనే సినిమా ప్రచారం ఫుల్‌ స్వింగ్‌లో ప్రారంభమవుతుంది.

ప్రభాస్‌ హీరోగా ఇతిహాసాలు, సైన్స్‌ ఫిక్షన్‌ కలగలిపిన నేపథ్యంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) , కమల్‌ హాసన్‌ (Kamal Haasan) తదితరులు ఇతర కీలక పాత్రధారులు. జూన్‌ 27న సినిమాను విడుదల చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. దీని కోసం టీమ్‌ మొత్తం వివిధ నగరాల్ని చుట్టేసి ప్రచారం చేయాలని అనుకుంటోందట. ‘బాహుబలి’ (Baahubali) సినిమా ప్రచారం స్టైల్‌ను ‘కల్కి’ వాడుతుందట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.