Prabhas: ప్రభాస్‌ కొత్త సినిమాలు.. ఒక్కో న్యూస్‌ వింటుంటే ఎంత ఆనందమో!

అగ్ర స్టార్‌ హీరోలు ఒకేసారి రెండు సినిమాలు సెట్స్‌ మీద పెట్టడం చాలా అరుదు. అయితే ఇటీవల కాలంలో మన స్టార్‌లు ఇలాంటి ఫీట్‌లు చేస్తున్నారు. ఒక సినిమా షూటింగ్‌ అవుతుండగానే.. మరో సినిమా పట్టాలెక్కిస్తున్నారు. అలా ప్రభాస్‌ (Prabhas) కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. అలా ఇప్పుడు ఏక కాలంలో మూడు సినిమాల షూటింగ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. దీంతో ఇవి నోటిని తీపి చేసే వార్తలు అని అభిమానులు ఆనందిస్తున్నారు.

ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్‌ 27న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ విషయంలో ఇకపై ఎలాంటి మార్పులు ఉండవు అని చెబుతున్నారు. దీంతో తర్వాతి సినిమా ఏంటి అనే ప్రశ్నకు ‘సలార్‌ 2’ (Salaar) అనే సమాధానం వస్తోంది. ఈ సినిమాను అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జూన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది అని అంటున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.

అయితే, వచ్చే నెల షూటింగ్‌లో ప్రభాస్‌ ఎంటర్‌ అవ్వడట. ప్రభాస్‌ లేని సీన్స్‌ను ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) తొలుత తెరకెక్కించేస్తారట. ఆ తర్వాత అంటే జులైలో ఏక కాలంలో రెండు సినిమాల షూటింగ్‌ ఉంటుంది అని చెబుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌ను జులైలో ప్రారంభిస్తారట. దాంతోపాటే ‘సలార్‌ 2’ చిత్రీకరణ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. మరి రెండు లుక్స్‌ని ఎలా హ్యాండిల్‌ చేస్తారో చూడాలి.

మరోవైపు మారుతి (Maruthi Dasari) ‘రాజాసాబ్‌’ (The Rajasaab) చిత్రీకరణ సంగతి కూడా అదే సమయంలో చూస్తారట. అలాగే ఈ ఏడాది ఆఖరులో సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్‌’ (Spirit) కూడా ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. అలాగే సినిమా మొదలై కాస్త సమయం గడవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడే కదా సినిమా రిలీజ్‌ డేట్‌ల విషయంలో క్లారిటీ వస్తుంది కాబట్టి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.