Yash: యశ్‌ కొత్త సినిమా… కరీనా స్థానంలో పాన్‌ ఇండియా హీరోయిన్‌!

‘కేజీయఫ్‌’ (KGF2) సినిమాల తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎంతమంది అడిగినా ఎవరికీ ఓకే చెప్పని యశ్‌ (Yash) … గీతూ మోహన్‌ దాస్‌ (Geetu Mohandas) అనే మలయాళ లేడీ దర్శకురాలికి అవకాశం ఇచ్చాడు. ‘టాక్సిక్‌’ (Toxic)  అనే పేరుతో ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. అలా సినిమా అనౌన్స్‌ చేయడం ఆలస్యం… వెంటనే బయటకు వచ్చిన పుకారు ‘ఈ సినిమాలో కరీనా కపూర్‌ (Kareena Kapoor) నటిస్తోంది’ అని. ఈ విషయంలో ఆ తర్వాత చాలా పుకార్లు వచ్చాయి.

ఇప్పుడు ఏకంగా ఆమె ప్లేస్‌లో మరో హీరోయిన్‌ ఫిక్స్‌ అని కూడా అంటున్నారు. ‘టాక్సిక్‌’ సినిమాలో ప్రధాన పాత్ర నయనతార (Nayanthara) దక్కించుకున్నట్లు తాజా సమాచారం. ఆమెతో చిత్ర బృందం సంప్రదింపులు చేసిందనీ.. కథ నచ్చడంతో ఆమె కూడా ఓకే చెప్పింది అని అంటున్నారు. అయితే సినిమాలో నయ్‌.. యశ్‌కు జోడీగా కనిపిస్తుందా? లేక సోదరిగా నటిస్తుందా? అనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌లో త్వరలో నయన్‌ పాల్గొంటుంది అని చెబుతున్నారు.

‘టాక్సిక్‌’ సినిమాలో తోబుట్టువుల మధ్య భావోద్వేగం కనిపిస్తుంది. అలాంటి ఓ సోదరి పాత్రలో అగ్ర తార ఉంటేనే పాత్ర పండుతుందని టీమ్‌ అనుకుంటోందట. మరోవైపు సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కనుండటంతో బాలీవుడ్‌ హీరోయిన్‌ను తీసుకుందాం అనుకున్నారట. ఈ క్రమంలో ఆమె వైపు నుండి కూడా పాజిటివ్‌ స్పందనే వచ్చింది అని కూడా అన్నారు. కట్‌ చేస్తే.. ఇప్పుడు ఆ ప్లేస్‌లో నయన్‌ను తీసుకుందాం అనుకుంటున్నారట.

లేడీ సూపర్‌ స్టార్‌గా పేరుగాంచిన నయన్‌.. ఈ సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తుందో చూడాలి. ఇప్పటికే నయన్‌ ‘గాడ్‌ ఫాదర్‌’లో (God Father) సోదరి పాత్ర చేసి మెప్పించిన విషయం తెలిసిందే. అందులో చిరంజీవికి సోదరిగా నటించి మెప్పించిన నయన్‌.. ఇప్పుడు యశ్‌ సరసన కూఆ అదే స్థాయిలో నటించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరి ఆమె ఓకే చెబుతుందా? లేదా? అనేది చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.