Pushpa 2: నాగబాబు ట్విట్టర్ హడావిడి.. ‘పుష్ప 2’ కొంపముంచదు కదా?

అల్లు అర్జున్ (Allu Arjun) మెగా హీరోగానే పాపులర్ అయ్యారు. మెగా హీరోగానే స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. కానీ అక్కడి నుండి పాన్ ఇండియా స్టార్ అవ్వడంలో మాత్రం అతని కృషే ఎక్కువగా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒకసారి ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యారు. ఆ తర్వాత నుండి మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని కొంచెం సెపరేట్ గా చూడటం అలవాటు చేసుకున్నారు.

అల్లు అర్జున్ కూడా మెగా అనే బ్రాండ్ కి దూరంగా తన ఫ్యాన్ బేస్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సరే ‘చెప్పను బ్రదర్’ అనే వివాదాన్ని మర్చిపోయి పవన్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ‘జనసేన’ పార్టీకి చేయని ప్రచారం.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి చేశాడు బన్నీ. దీంతో ”జనసేన’ ని కాదని వైసీపీ అభ్యర్థికి ఎలా ప్రచారం చేసావ్?’ అంటూ కొందరు మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదే టైంలో నాగబాబు (Naga Babu)  ” ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడే,మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!” అంటూ ఓ ట్వీట్ వేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యాడు. ఆ ట్వీట్ నిజంగా బన్నీని ఉద్దేశించే నాగబాబు వేశారా? అనేది ఆయన క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ బన్నీ ఫ్యాన్స్ ట్రోల్స్ భరించలేకో ఏమో కానీ ఆయన ట్విట్టర్ డీ యాక్టివేట్ చేయడం జరిగింది. నాగబాబు ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేశారు అంటే డౌట్ లేకుండా ఆయన అల్లు అర్జున్ ని ఉద్దేశించే ఆ ట్వీట్ వేశారు అని అంతా ఫిక్స్ అయిపోయారు.

దీంతో ‘పుష్ప 2’ (Pushpa2) పరిస్థితి ఏంటి అనే డౌట్ అందరిలో ఉంది. ఎందుకంటే గతంలో ‘డీజే’ (Duvvada Jagannadham) సినిమాకు పవన్ ఫ్యాన్స్ నుండీ వ్యతిరేకత ఎదురైంది. ఇప్పుడు పవన్ పొలిటికల్ గా కూడా స్ట్రాంగ్ అయ్యారు. ఆయన అభిమానులు కూడా అల్లు అర్జున్ మేటర్ ని అంత ఈజీగా తీసుకునేలా లేరు. మరి చూడాలి ఏమవుతుందో? ఏదేమైనా నాగబాబు ట్విట్టర్ రచ్చ వల్ల ‘పుష్ప 2’ కి సమస్యలు తప్పేలా లేవు..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.