March 31, 202510:55:45 AM

Rahul Ravindran: చిన్మయికి అలా ప్రామిస్ చేసిన రాహుల్ రవీంద్రన్.. ఏమైందంటే?

సింగర్ చిన్మయి (Chinmayi Sripaada) , రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అవుతున్నా ఈ జంట అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకోగా ప్రస్తుతం రష్మికతో ఈ దర్శకుడు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాను తెరకెక్కిస్తుండటం గమనార్హం. ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి. అయితే రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా వేదికగా చిన్మయి గురించి ప్రస్తావిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

మనం రాజకీయంగా మిగతా వాటిలో భిన్నంగా ఉండొచ్చని మీ విలువలు, వ్యవస్థ ప్రమాదకరమని నేను చెప్పొచ్చని కానీ నా విషయంలో మీరు కూడా అలాగే భావిస్తారని అనుకుంటున్నానని రాహుల్ రవీంద్రన్ వెల్లడించడం గమనార్హం. నేను 100% పర్ఫెక్ట్ అని చెప్పడాన్ని ఖండిస్తున్నానని ఆయన అన్నారు. నేను ద్వేషించే సినిమాలు మీకు నచ్చొచ్చని నేను ఇష్టపడే టీమ్స్ ను మీరు ట్రోల్ చేయొచ్చని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు.

మనం భిన్నమైన అభిరుచులు, వ్యక్తిత్వం కలిగి ఉండొచ్చని ఆయన చెప్పుకొచ్చారు. మనం కాలానుగుణంగా మారొచ్చని లేదా మారకపోవచ్చని కానీ నేను మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని వాగ్దానం చేస్తున్నానని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు. ఏ విషయం గురించైనా సరే నేను మీతో చర్చిస్తానని మాట ఇస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. మీరు లేనప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడనని ప్రామిస్ చేస్తున్నానని ఆయన తెలిపారు.

మనిద్దరం భిన్నమైన వ్యక్తులం కావచ్చని అంత మాత్రాన మనం శత్రువులుగా ఉండాల్సిన అవసరం లేదని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు. రాహుల్ కామెంట్లకు చిన్మయి స్పందిస్తూ “బుద్ధ భగవాన్.. నేను 100 శాతం అలాంటి వారినే ప్రశ్నిస్తా.. ఎల్లప్పుడూ ఉత్తమమైన వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తా” అని రియాక్ట్ అయ్యారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.