March 18, 202503:01:59 AM

Ram Charan: ఆ దేవుడి ఫోటోను వాల్ పేపర్ గా పెట్టుకున్న చరణ్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. సినిమాలో తన నటనతో డ్యాన్సులతో మేనరిజంతో ప్రేక్షకులను మెప్పించడంతోపాటు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. రామ్ చరణ్ (Ram Charan) చివరగా రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వం ఆర్ఆర్ఆర్ (RRR)తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ (Game changer) మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలలో నటించడానికి ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు చెర్రీ. త్వరలోనే బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా రాంచరణ్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే.. చెర్రీ తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడంతో పాటు ఎన్నో విషయాల్లో చిరంజీవికి మ్యాచింగ్ గా కూడా నిలుస్తున్నారు.

సోషల్ మీడియాలో నిరంతరం ఈయనకు సంబంధించిన ఏదో ఒక వార్త ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాగా రామ్ చరణ్ మొబైల్ వాల్ పేపర్ ను చూసి అందరు షాక్ అవుతున్నారు. దైవభక్తి రామ్ చరణ్ కు ఎక్కువగానే ఉందన్న విషయం తెలిసిందే. ఆంజనేయస్వామి భక్తుడు కూడా, ఈ క్రమంలోనే ఆయన మొబైల్ వాల్ పేపర్ ఫొటోగా ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకున్నారు.

ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆంజనేయ స్వామి భక్తుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా రాంచరణ్ వాల్ పేపర్ వైరల్ అవ్వడంతో ఆయన కూడా హనుమాన్ భక్తుడే అన్న విషయం బయటపడింది. ఈ విషయంలో తండ్రి నే ఫాలో అవుతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు..

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.