Renu Desai: దయచేసి నన్ను నన్నులా చూడండి.. రేణూదేశాయ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటి, పవన్ (Pawan Kalyan)Pawan Kalyan మాజీ భార్య రేణూదేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల క్రితం రేణూదేశాయ్ టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాలో నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. జంతు సంరక్షణ కోసం రేణూదేశాయ్ విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఒక నెటిజన్ రియాక్ట్ అవుతూ “మా పవన్‌ కల్యాణ్‌ అన్నయ్యలా గోల్డెన్‌ హార్ట్‌” అంటూ కామెంట్ చేశారు.

ఈ కామెంట్ తన దృష్టికి రావడంతో నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు అంటూ రేణూదేశాయ్ ఫైర్ అయ్యారు. పది సంవత్సరాల వయస్సు నుంచి నేను జంతు సంరక్షణ కోసం నా వంతు సహాయం చేస్తున్నానని ఆమె తెలిపారు. దానికి నా మాజీ భర్తతో సంబంధం లేదని రేణూదేశాయ్ పేర్కొన్నారు. జంతువులపై నేను చూపించే ప్రేమ, కేర్ ఆయనకు లేవని రేణూదేశాయ్ కామెంట్లు చేయడం గమనార్హం.

దయచేసి నేను చేసే పనుల గురించి పోస్ట్ పెడితే ఆయన ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్ చేయొద్దని రేణూదేశాయ్ వెల్లడించారు. ఈ మాటలు బాధతో అన్నవే తప్ప కోపంతో అన్నవి కాదని ఆమె మరో పోస్ట్ ద్వారా వెల్లడించడం గమనార్హం. పర్సనల్ గా నా మాజీ భర్తతో ఎలాంటి సమస్య లేదని అయితే నన్ను నన్నుగా చూడాలంటూ ఆమె పేర్కొన్నారు. రేణూదేశాయ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రేణూదేశాయ్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. పాత్ర మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే ఆమె ఓకే చెబుతున్నారని తెలుస్తోంది. రేణూదేశాయ్ చేసిన కామెంట్లు ఆమె అభిప్రాయం ప్రకారం రైటేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుని రేణూదేశాయ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.