March 26, 202508:31:59 AM

Sandeep Kishan: సందీప్ కిషన్ తల్లి పాత్రలో ఆ హీరోయిన్ కనిపించనున్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సందీప్ కిషన్ కు (Sundeep Kishan) ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా ఆశించిన హిట్లు దక్కుతున్నాయి. ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona)  సినిమా తర్వాత ఈ జనరేషన్ ప్రేక్షకులకు నచ్చే కథాంశాలపై సందీప్ కిషన్ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. సందీప్ కిషన్ కొత్త సినిమాలో మన్మథుడు మూవీ ఫేమ్ అన్షు (Anshu)  సందీప్ కు తల్లిగా కనిపిస్తారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ పాత్రకు సంబంధించి ట్విస్ట్ ఉంది.

ఈ సినిమాలో రావు రమేష్ (Rao Ramesh) సందీప్ కిషన్ తండ్రి పాత్రలో కనిపిస్తారని ఆ పాత్ర అన్షు పాత్రకు లైన్ వేస్తారని అలా సందీప్ కు వరుసకు తల్లి పాత్రలో అన్షు కనిపించనున్నారని భోగట్టా. అయితే అన్షు లేదా మేకర్స్ నుంచి క్లారిటీ వస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదని భోగట్టా. మన్మథుడు బ్యూటీ రీఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ధమాకా (Dhamaka) సక్సెస్ తర్వాత త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. సందీప్ కిషన్ 30వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే అన్షు తెలుగులో మరింత బిజీ అయ్యే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో అన్షు చాలా యాక్టివ్ గా ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ల కొరత ఉంది.

అన్షు రీఎంట్రీ వస్తే మాత్రం అన్షు కెరీర్ పరంగా తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అన్షు కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అన్షుకు భారీస్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారని భోగట్టా.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.