Shakalaka Shankar: ఆ విషయంలో చిరంజీవి గ్రేట్ అన్న షకలక శంకర్.. ఏమైందంటే?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నంబర్ వన్ స్థానంలో ఉన్నారనే సంగతి తెలిసిందే. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమా 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి మంచి లాభాలను అందించింది. అయితే ప్రముఖ నటుడు షకలక శంకర్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గొప్పదనం చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇండియాలో 100 మంది హీరోలు ఉంటారని ఆ హీరోలందరిలో ఎక్కువగా శ్రమించే హీరో, కష్టపడే తత్వం ఉన్న హీరో చిరంజీవి మాత్రమేనని షకలక శంకర్ (Shakalaka Shankar) అన్నారు.

ఇప్పటికీ చిరంజీవి ప్రతి సినిమాకు ఎంతో కష్టపడుతున్నారని ఆయన తెలిపారు. చిరంజీవి గొప్పదనం గురించి చెబుతూ షకలక శంకర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తారని షకలక శంకర్ చెప్పగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి ప్రస్తుతం వశిష్ట (Mallidi Vasishta) దర్శకత్వంలో విశ్వంభర (Vishwambhara) సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా విడుదలకు సరిగ్గా ఏడు నెలల సమయం ఉందనే సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. గత కొన్నేళ్లలో చిరంజీవి మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగింది. చిరంజీవి సినిమాలు బిజినెస్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న చిరంజీవి తర్వాత సినిమాలతో భారీ హిట్లను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. విశ్వంభర సినిమా సక్సెస్ సాధిస్తే చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చిరంజీవి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.