March 29, 202504:15:47 PM

ఈ ఏడుగురు క్రేజీ హీరోయిన్ల టాటూ వెనుక ఏకంగా ఇంత అర్థం ఉందా?

ఈ మధ్య కాలంలో టాటూ వేయించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. హీరో, హీరోయిన్ అనే తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు టాటూ వేయించుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే హీరోయిన్ల టాటూల వెనుక ఉన్న అర్థం ఏంటో అభిమానులకు తెలియదు. స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) తెలుగులో ఏ మాయ చేశావె సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు. ఈ సినిమా పేరును షార్ట్ కట్ గా సమంత “YMC” అని వీపు భాగంలో టాటూ వేయించుకున్నారు.

తన సినీ కెరీర్ లో ఆ సినిమా ఎప్పటికీ ప్రత్యేకం అని ఆ సినిమాపై ఉన్న అభిమానాన్ని సమంత ఈ విధంగా చాటుకున్నారు. హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier) తన ఛాతీపై సీజ్ ది డే అని టాటూ వేయించుకున్నారు. ఈ పచ్చబొట్టుకు రోజును ఆస్వాదించడం అనే అర్థం వస్తుంది. స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ (Shradha Srinath) కూడా ఛాతీపై ఎడమవైపున టాటూ వేయించుకున్నారు. 18 సంవత్సరాల వయస్సులో ఒక అబ్బాయిని ఇష్టపడిన శ్రద్ధా శ్రీనాథ్ ఆ అబ్బాయి గుర్తుగా ఈ టాటూ వేయించుకోవడం గమనార్హం.

కల్కి 2898 ఏడీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనే (Deepika Padukone) మెడపై “82°e” అనే టాటూ వేయించుకున్నారు. ఈ టాటూకు అర్థం 82 డిగ్రీస్ ఈస్ట్ కాగా దీపిక సొంతంగా రన్ చేస్తున్న స్కిన్ కేర్ బ్రాండ్ పేరు కూడా ఇదే కావడంతో ఈ పేరును ఆమె టాటూగా వేయించుకున్నారు. స్టార్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఇటీవల తన టాటూ అర్థం చెప్పిన సంగతి విదితమే. ఆమె కాలిపై చెట్టు వేర్ల టాటూ ఉండగా మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా రూట్స్ ప్రధానమని ఆ టాటూ చెబుతుంది.

స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika Mandanna) తన కుడి చేతిపై “irreplaceable” అనే టాటూ వేయించుకున్నారు. కాలేజ్ లో చదివే సమయంలో ఒకరిపై ఛాలెంజ్ చేసి మరీ రష్మిక ఈ టాటూ వేయించుకున్నారని తెలుస్తోంది. ఈ టాటూకు దేనినీ మరో దానితో భర్తీ చేయలేం అనే అర్థం వస్తుంది. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఎడమ చేతిపై ఐ లవ్ యూ లబ్బూ అనే టాటూ ఉంటుంది. తల్లి శ్రీదేవి (Sridevi) ప్రేమతో పేపర్ పై రాసిచ్చిన దానిని జాన్వీ కపూర్ టాటూలా చేతిపై ముద్రించుకున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.