March 22, 202509:56:51 AM

Shyamala Devi, Pawan Kalyan: పవన్ గెలుపుపై జోస్యం చెప్పిన ప్రభాస్ పెద్దమ్మ.. ఏమన్నారంటే?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నుంచి పోటీ చేస్తుండగా ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు పవన్ కు మద్దతు ప్రకటించడంతో పాటు పవన్ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటుండగా ఆ కోరిక సులువుగానే తీరుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ప్రభాస్ (Prabhas) పెద్దమ్మ శ్యామలాదేవి పవన్ గెలుపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పిఠాపురం నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అని శ్యామలాదేవి కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని ప్రభాస్ పెద్దమ్మ చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరికీ రాని మెజార్టీతో పవన్ విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని శ్యామలాదేవి కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. శ్యామలాదేవి కామెంట్స్ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ ఎవరికి ఉంటుందో తెలియాల్సి ఉంది.

మరోవైపు శ్యామలాదేవి తాజాగా బీజేపీ తరపున కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. నరసాపురంలో కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థిని గెలిపించాలని ఆమె కోరారు. వాస్తవానికి శ్యామలాదేవికి నరసాపురం ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించింది. ఆమె మాత్రం సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించారు. ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నా కొన్ని కారణాల వల్ల వెనక్కు తగ్గారని తెలుస్తోంది.

శ్యామలాదేవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే బాగుండేదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఆమె భవిష్యత్తు ఆలోచనలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. ప్రభాస్ పెళ్లి గురించి త్వరలో శ్యామలాదేవి నుంచి గుడ్ న్యూస్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ ఈ ఏడాదైనా పెళ్లికి సంబంధించిన అదిరిపోయే శుభవార్తను చెబుతారేమో చూడాల్సి ఉంది. శ్యామలాదేవి కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.