March 21, 202501:30:35 AM

Sobhita Dhulipala: చైను చాయ్ చేశావంటూ శోభితపై కామెంట్స్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ (Thandel) సినిమాతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 40 కోట్ల రూపాయలకు అమ్ముడవడం హాట్ టాపిక్ అవుతోంది. చైతన్య చందూ మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్ మూవీ కావడం వల్లే ఈ సినిమా హక్కులు ఇంత భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. అయితే చైతన్య, శోభిత (Sobhita Dhulipala) ఒకరినొకరు ఇష్టపడుతున్నారని చాలా సందర్భాల్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

తాజాగా శోభిత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో ఆఫర్లను అందుకుంటున్న శోభిత ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో “ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్, అండ్ దట్స్ ఓకే” అని పేర్కొన్నారు. నేనందరికీ నచ్చకపోయినా పరవాలేదని ఆ పోస్ట్ అర్థం. సాధారణంగా అందరూ కప్ ఆఫ్ టీ అని కామెంట్ చేస్తారు. అయితే శోభిత మాత్రం కప్ ఆఫ్ చాయ్ అని పోస్ట్ చేయడంతో చైతన్య నిక్ నేమ్ అయిన చైను చాయ్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ కామెంట్ల విషయంలో శోభిత రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. మరోవైపు సమంత (Samantha)  స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఈ పోస్ట్ గురించి స్పందించడం గమనార్హం. నేను కూడా నా విషయంలో అలాగే ఫీలవుతూ ఉంటానని ప్రీతమ్ జుకల్కర్ పేర్కొన్నారు. గూఢచారి (Goodachari) , మేజర్(Major) సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శోభిత వెబ్ సిరీస్ లలో సైతం నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

శోభిత తెలుగులో మరిన్ని సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో శోభిత కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. చైతన్య, శోభిత కాంబోలో సినిమా రావాలని కొందరు ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.