
‘సుచి లీక్స్’ తో సంచలనం సృష్టించిన తమిళ సింగర్ సుచిత్ర (Suchitra Ramadurai) .. ఇప్పుడు మరో తుఫాను సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె హీరో ‘ధనుష్ (Dhanush) ఒక ‘గే’ అని..! తెల్లవార్లూ బాయ్ ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుని వెళ్ళేవాడు, పైగా డ్రగ్స్ కి కూడా బానిసయ్యాడు. ధనుష్ గే అని తెలుసుకున్న ఐశ్వర్య (Aishwarya Rajinikanth) అతన్ని వదిలించుకుంది. వాళ్ళు తప్పుదోవలో ఎఫైర్లు కొనసాగించారు’ అంటూ ఘోరమైన కామెంట్లు చేసింది.
అంతేకాదు.. ధనుష్ బాయ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఆమె మాజీ భర్త కార్తీక్ కుమార్ కూడా ఉన్నాడని.. అతను కూడా గే అన్నట్టు ఈమె చెప్పుకొచ్చింది. ఇవి సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ కి దారితీశాయి. ఇక సుచిత్ర కామెంట్స్ కి తాజాగా ఆమె మాజీ భర్త కార్తీక్ కుమార్.. ఓ వీడియో ద్వారా ఇన్స్టాగ్రామ్లో స్పందించాడు. ‘నేను నిజంగా గే అయితే.. ఆ విషయాన్ని నేను దాచాలని ప్రయత్నించను.
హ్యాపీగా స్వలింగ సంపర్కుల ర్యాలీలో పాల్గొనేవాడిని’ అంటూ చెప్పుకొచ్చాడు. కార్తీక్ కుమార్ (Karthik Kumar) , సుచిత్ర 2005 లో పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. అయితే మనస్పర్థలు రావడంతో 2017 లో విడాకులు తీసుకున్నారు. అటు తర్వాత సుచిత్ర వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సుచి లీక్స్ టైంలో సుచిత్ర.. ఎవరో తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసారని కవర్ చేసింది. ఆ టైంలో కార్తీక్ కుమార్.. ‘సుచిత్రకి మతిస్థిమితం లేదు’ అంటూ కామెంట్స్ చేశాడు.
View this post on Instagram
View this post on Instagram