Upasana: ఆ కామెంట్లతో తల్లిప్రేమను చాటుకున్న ఉపాసన.. ఏం చెప్పారంటే?

మెగా కోడలు ఉపాసనకు సోషల్ మీడియా ఫాలోవర్లలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఉపాసన తాజాగా ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఉపాసన బిజినెస్ ఉమెన్ కావడంతో రోజులో ఎక్కువ సమయంలో క్లీంకారకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి గురించి ఉపాసన కీలక వ్యాఖ్యలు చేశారు. మాకు ఉన్న వర్క్ వల్ల కొన్నిసార్లు పాపను వదిలేసి వెళ్లాల్సి వచ్చేదని ఆ సమయంలో పాప కంటే మేమే ఎక్కువగా బాధ పడతామని ఉపాసన తెలిపారు.

క్లీంకార కోసం ఏడ్చిన సందర్భాలు సైతం ఉన్నాయని ఉపాసన కామెంట్లు చేశారు. ప్రెగ్నెన్సీ సమయంలో నా భర్త నుంచి చాలా సపోర్ట్ లభించిందని ఈ విషయంలో నేను చాలా లక్కీ అని ఉపాసన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఉపాసన తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే గేమ్ ఛేంజర్ (Game changer) మూవీ షూటింగ్ నత్తనడకన జరుగుతుండటం గమనార్హం.

గేమ్ ఛేంజర్ దసరాకు విడుదలవుతుందని ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఈ వార్తలను ఎవరూ ధృవీకరించడం లేదనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి గ్లింప్స్ కూడా విడుదల కాలేదు. గేమ్ ఛేంజర్ బడ్జెట్ అంతకంతకూ పెరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్, కియారా అద్వానీ (Kiara Advani) కాంబినేషన్ లో వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) తర్వాత తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమాలో యాక్షన్ సీన్స్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. చరణ్, ఉపాసనలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.