March 18, 202510:43:56 AM

Udaya Bhanu, Balakrishna: ఆ విషయంలో బాలయ్యకు ఎవరూ సాటిరారన్న ఉదయ భాను.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఆదుకునే విషయంలో ముందువరుసలో ఉంటారు. బాలయ్యకు కోపం ఎక్కువని చిరాకు తెప్పిస్తే కొడతారని టాక్ ఉన్నా బాలయ్యను దగ్గర్నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఆయన చాలా మంచి వ్యక్తి అని ఇతరులకు కష్టం వస్తే అసలు తట్టుకోలేరని చెబుతారు. సీనియర్ యాంకర్ ఉదయభాను (Udaya Bhanu) తాజాగా ఒక సందర్భంలో బాలయ్య గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

యాంకర్ ఉదయభాను ఒక షోలో బాలయ్య గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు. నేను 12 సంవత్సరాల వయసులో కెరీర్ ను మొదలు పెట్టానని అప్పటినుంచి నా జీవితంలో సెలబ్రేషన్స్ లేవని ఆమె అన్నారు. ఆడపిల్లలకు కోరికలు ఉంటాయని గర్భవతి అయిన తర్వాత కోరికలు ఇంకా పెరుగుతాయని ఆమె చెప్పుకొచ్చారు. శ్రీమంతం చేసుకోవాలని మహిళలు కోరుకుంటారని ఉదయభాను కామెంట్ చేశారు. ఒకానొక సమయంలో దేవుడు లేడు ఏమో అని అనుకున్నానని ఉదయభాను అన్నారు.

నాకు పిల్లలు అంటే ఎంత ఇష్టమో నేను మాటల్లో చెప్పలేనని ఉదయభాను వెల్లడించారు. చివరకు నాకు ఇద్దరు బిడ్డలు పుట్టారని ఆమె పేర్కొన్నారు. నా పిల్లల పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం కొంతమంది సెలబ్రిటీలను కాంటాక్ట్ అయితే కొంతమంది అసలు రెస్పాండ్ కాలేదని ఉదయభాను కామెంట్ చేశారు. బాలయ్య బాబు గారి నెంబర్ కి ఒక మెసేజ్ పెట్టానని అరగంట తర్వాత బాలయ్య ఫోన్ చేసి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు ఖచ్చితంగా వస్తానని మాట ఇచ్చారని ఉదయభాను అన్నారు.

బాలయ్యకు వేరే ప్రాంతంలో మీటింగ్ ఉన్నా ఆ మీటింగ్ ను పూర్తి చేసి చెప్పిన సమయానికి వచ్చారని ఉదయభాను వెల్లడించారు. ఆ సమయంలో బాలయ్యలో ఒక చిన్నపాటి దేవుడు కనిపించాడని ఉదయభాను అన్నారు. బాలయ్య 45 నిమిషాలపాటు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని అందరితో ఫోటోలు దిగారని చెబుతూ ఉదయభాను ఎమోషనల్ అయ్యారు. హ్యాట్సాఫ్ బాలయ్య అంటూ ఆమె కామెంట్ చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.