
చాలా రోజులుగా తెరకెక్కుతున్న ఓ సినిమా గురించి మొన్నీ మధ్యే మనం మాట్లాడుకున్నాం. కాస్త బాగానే ప్రచారంతో మొదలుపెట్టిన ఆ సినిమా ఇప్పుడు ఎందుకు సప్పుడు చేయడం లేదు అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమా పేరు ఇదేనంటూ కొన్ని పేర్లు వినిపించాయి. ఆఖరిగా ఆ సినిమా పేరును ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) అనే పేరును బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు అదే పేరును అనౌన్స్ కూడా చేసేశారు.
Kalyan Ram
ఈ క్రమంలో సినిమా విడుదల ప్రచారాన్ని కూడా షురూ చేసేశారు. హీరో కల్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram), నటి విజయశాంతి (Vijaya Shanthi) కలసి టీవీ షోలకు వెళ్తున్నారు. అలా ఉగాది సందర్భంగా ఓ టీవీ ఛానల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కల్యాణ్‌రామ్, విజయశాంతి వచ్చారు. ఈ క్రమంఓ విజయశాంతిని తాను అమ్మ అని పిలుస్తానని కల్యాణ్‌రామ్ చెప్పుకొచ్చారు. సినిమా వల్ల ఆమెతో అనుబంధం పెరిగిందని కూడా ఆయన చెప్పారు.
తండ్రీకొడుకులు చాలా విషయాల్లో గొడవ పడడం.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక్కటవడం చాలా సినిమాల్లో మనం చూశాం. కానీ మా సినిమాలో ప్రేమగా ఉండే తల్లీకొడుకులు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? మళ్లీ ఎలా కలుసుకున్నారు? అనే అంశం ఆధారంగా ఉంటుంది అని కల్యాణ్ రామ్ చెప్పారు. దర్శకుడు ప్రదీప్ (Pradeep Chilukuri) సినిమా కథ చెప్పిన సమయంలో తల్లి పాత్రలో విజయశాంతినే ఊహించుకున్నా అని చెప్పారు.
తాను ఆమెను విజయశాంతి అని అనని, అమ్మ అనే పిలుస్తా అని కల్యాణ్‌రామ్ చెప్పుకొచ్చాడు. ఇద్దరి మధ్య తల్లీ బిడ్డల అనుబంధం ఏర్పడింది అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాకు స్ఫూర్తి ‘కర్తవ్యం’ సినిమా అని కూడా చెప్పారాయన. ఆ సినిమాలోని వైజయంతి (విజయశాంతి పాత్ర)కి అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది? అనే అంశం ఆధారంగానే ఈ కథను డెవలప్ చేశామని దర్శకుడు తెలిపారు. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు.
‘వైజయంతి’ అనే పేరు చెప్పినప్పుడు నాకు ‘కర్తవ్యం’ గుర్తుకొచ్చింది
అమ్మ(విజయశాంతి) చేస్తానంటేనే ఈ కథ చేద్దాం అని దర్శకుడికి చెప్పాను : కళ్యాణ్ రామ్ #KalyanRam #Vijayashanti #ArjunSonOfVyjayanthi pic.twitter.com/xc0UNItDGy
— Filmy Focus (@FilmyFocus) March 17, 2025