Upasana: రామ్ చరణ్ పోస్ట్ గురించి ఉపాసన రియాక్షన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

స్టార్ హీరో రామ్ చరణ్ కు (Ram Charan)రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ తర్వాత సినిమాలతో ఇతర భాషల్లో సైతం తన రేంజ్ ను మరింత పెంచుకోవడం గ్యారంటీ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తన తండ్రికి (Chiranjeevi) పద్మవిభూషణ్ రావడంతో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన సంతోషాన్ని పంచుకున్నారు.

కొడుకుగా తాను ఎంతో గర్వపడుతున్నానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. అయితే రామ్ చరణ్ చేసిన పోస్ట్ కు ఉపాసన ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. “వావ్ మిస్టర్ రామ్ చరణ్.. పోస్టెడ్ ఆన్ టైమ్” అంటూ ఉపాసన రియాక్ట్ అయ్యారు. చరణ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎప్పుడు ఆలస్యంగా రియాక్ట్ అవుతారని ఉపాసన చెప్పకనే చెప్పేశారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

గతంలో నిహారిక (Niharika) సైతం ఒక సందర్భంలో రామ్ చరణ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరని ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉండరని వాట్సాప్ కూడా వాడరని పేర్కొన్నారు. అప్పుడు నిహారిక చెప్పిందే ఇప్పుడు ఉపాసన చెబుతోంది అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. చరణ్ ఈ కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్స్ లో వేగంగా నటించాలని ఏడాదికి ఒక సినిమాలో అయినా నటించాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. చరణ్ కు ప్రముఖ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. రామ్ చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తానని అభిమానులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాటను చరణ్ ఎప్పుడు నిలబెట్టుకుంటారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.