March 22, 202506:33:54 AM

Vijay, Rashmika: విజయ్ రష్మిక కాంబోలో సినిమా.. గీతా గోవిందం రికార్డ్స్ బ్రేక్ అవుతాయా?

స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు గీతా గోవిందం (Geetha Govindam) సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈ సినిమా అప్పట్లోనే 70 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుని చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక (Rashmika Mandanna) కాంబోలో డియర్ కామ్రేడ్ (Dear Comrade) సినిమా తెరకెక్కినా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.

అయితే ఈ కాంబో రిపీట్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాన్ ( Rahul Sankrityan)  కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో రష్మికను తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని భోగట్టా. 18వ శతాబ్దంలో జరిగిన చారిత్రక ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా టైటిల్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

మంచి కథ ఉంటే రష్మికతో కలిసి నటిస్తానని విజయ్ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ కాంబోలో సినిమా కచ్చితంగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. త్వరలో రష్మిక లేదా విజయ్ దేవరకొండ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. గత కొన్నేళ్లలో విజయ్ దేవరకొండ, రష్మిక మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగింది. విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

విజయ్ రష్మికలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ పరంగా బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. విజయ్ దేవరకొండ, రష్మిక పారితోషికాలు భారీ స్థాయిలో ఉన్నాయి. విజయ్ దేవరకొండ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.