March 22, 202503:01:34 AM

Adah Sharma: కొత్త ఫ్లాట్లోకి అడుగుపెట్టిన అదా శర్మ.. కానీ..!

‘సుశాంత్ (Sushant Singh Rajput) ఇంట్లోకి అదా శర్మ (Adah Sharma) ఏంటి? కొంపతీసి మన టాలీవుడ్ హీరో సుశాంత్.. అదా శర్మని పెళ్లి చేసుకోబోతున్నాడా?’ అని హెడ్డింగ్ చూశాక కొంతమంది కంగారు పడవచ్చు. కానీ అలాంటిదేమీ లేదు.. విషయం వేరు. మేటర్ ఏంటంటే.. దివంగత బాలీవుడ్ స్టార్ హీరో సింగ్ రాజ్ పుత్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ‘ఎం.ఎస్.ధోనీ : ది అంటోల్డ్ స్టోరీ’ ‘చిచోరే’ (Chhichhore) ‘పీకే’ వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన ఇతను..

ఆ తర్వాత పలు బిగ్ బడ్జెట్ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు. కానీ తర్వాత ఏమైందో ఏమో.. 2020 లాక్ డౌన్ టైంలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. తన సొంత ఫ్లాట్లోనే ఉరేసుకుని అతను ప్రాణాలు తీసుకున్నాడు. అతను చనిపోయిన తర్వాత.. ఆ ఫ్లాట్ లో కొన్నాళ్ళు పోలీసులు విచారణ జరిపారు. అది ముగిశాక.. అమ్మకానికి కూడా పెట్టారు. కానీ ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. సెంటిమెంట్ గా ఫీలయ్యి ఆ ఫ్లాట్ ను తీసుకోవడానికి అందరూ భయపడి ఉండవచ్చు.

అయితే ఇప్పుడు ఆ ఫ్లాట్ లోకి అదా శర్మ అడుగుపెట్టబోతోంది. అవును అదా శర్మ ఆ ఫ్లాట్ ని కొనుగోలు చేసి.. నెల రోజులుగా అక్కడే ఉంటూ వస్తోందట. ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) తర్వాత అదా శర్మకి బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి.అక్కడి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్, వెబ్ సిరీస్.. వంటి వాటిల్లో ఈమె ఛాన్సులు దక్కించుకుంటుంది. అలా వచ్చిన డబ్బులతో.. తక్కువ రేటుకు వస్తుందని అదా శర్మ.. సుశాంత్ ఫ్లాట్ ని కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.