March 25, 202510:50:30 AM

Akira Nandan: అకీరా ఎంట్రీ ఎప్పుడంటున్న అభిమానులు.. కానీ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నా డిప్యూటీ సీఎం పదవి దక్కడంతో గతంలోలా ఆయన వేగంగా సినిమాలు చేయడం సాధ్యమయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన హీరోలు చాలా తక్కువమంది ఉన్నారు. అకీరా ఎంట్రీ ఎప్పుడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తమ్ముడు (Thammudu) సినిమా రీరిలీజ్ స్పెషల్ షోకు హాజరైన అభిమానులు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుందని పవన్ అభిమానుల సపోర్ట్ దక్కితే అకీరా సంచలనాలు సృష్టించడం పక్కా అని చెబుతుండటం గమనార్హం. తమ్ముడు రీరిలీజ్ స్పెషల్ షోకు అకీరా హాజరు కాగా అభిమానులు అకీరాను చుట్టుముట్టారు. అకీరా నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే దర్శకనిర్మాతలు అకీరాతో సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అకీరా మనస్సులో ఏముందనే ప్రశ్నకు జవాబులు దొరకాల్సి ఉంది.

పవన్ నట వారసత్వాన్ని అకీరా కొనసాగిస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. అకీరా నందన్ ఈ మధ్య కాలంలో పబ్లిక్ లో ఎక్కువగా కనిపిస్తున్నారనే సంగతి తెలిసిందే. అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడానికి సైతం నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని భోగట్టా.

మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో నెలకొన్న గందరగోళం త్వరలో తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. పవన్ సినిమాలకు డేట్లు కేటాయిస్తే ఆయన సినిమాలలో ఏ సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదల కానుందో వెల్లడి కానుంది. ఈ నెల 19వ తేదీన పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన శాఖలకు సంబంధించిన బాధ్యతలు స్వీకరించనున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.