March 21, 202501:20:36 AM

Allu Arjun, Atlee: మంచి కాంబో.. కానీ ఇక ఛాన్స్ లేదు.. కారణం అదే..!

అల్లు అర్జున్ (Allu Arjun) Allu Arjun.. ప్రస్తుతం ‘పుష్ప 2 ‘ తో (Pushpa2) బిజీగా గడుపుతున్నాడు. ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్ ఆ టైంకి కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా ‘పుష్ప 2’ విడుదల వాయిదా పడిందని ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) విడుదల తేదీ ఆగస్టు 15 కి ప్రకటించడంతో అందరికీ స్పష్టత వచ్చింది. అప్పుడు ‘పుష్ప 2 ‘ సెప్టెంబర్ లేదంటే డిసెంబర్ కి రావొచ్చనే టాక్ కూడా నడుస్తోంది.

సరే ‘పుష్ప 2 ‘ సంగతి అలా ఉంచితే, ‘అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల సంగతేంటి?’ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..! అల్లు అర్జున్ ‘పుష్ప 2 ‘ తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) , త్రివిక్రమ్ (Trivikram) .. వంటి స్టార్ డైరెక్టర్స్ తో పని చేస్తున్నట్టు ప్రకటించాడు. వాటికంటే ముందుగా ‘అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తాడని’ ఆయన టీం కూడా గట్టిగా చెప్పింది. కచ్చితంగా ‘పుష్ప 2 ‘ తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా ఇదని అంతా అనుకున్నారు.

అట్లీ కూడా నార్త్ లో ‘జవాన్’ తో (Jawan) బ్లాక్ బస్టర్ కొట్టాడు కాబట్టి.. అల్లు అర్జున్ కి నార్త్ తో పాటు తమిళంలో కూడా ప్లస్ అవుతుంది అని అంతా అనుకున్నారు.’గీతా ఆర్ట్స్’ సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించేందుకు రెడీ అయ్యింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఉండదని తెలుస్తుంది. ఎందుకంటే అట్లీ.. ఈ ప్రాజెక్టు కోసం రూ.80 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట.

అందుకు ‘గీతా ఆర్ట్స్’ సంస్థ సిద్ధంగా లేదని సమాచారం. పోనీ బయట నిర్మాతల్ని అడుగుదామని ట్రై చేసినా.. ఎవ్వరూ కూడా అంత మొత్తానికి అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేరని స్పష్టమవుతుంది. అందుకే ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కే అవకాశాలు లేకుండా పోయాయన్న మాట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.