March 19, 202512:37:15 PM

Allu Family: పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో బన్నీ కనిపించకపోవడానికి కారణాలివేనా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సాధించిన సంచలన ఫలితాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ ను మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పవన్ అంటే తుఫాన్ అని చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. అయితే పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో అల్లు ఫ్యామిలీ అస్సలు కనిపించలేదు. కొన్నిరోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియా వేదికగా సంచలనం అయిన సంగతి తెలిసిందే.

ఆ ట్వీట్ వల్లే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య కొంతమేర గ్యాప్ ఉందని పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో బన్నీ (Allu Arjun) కనిపించకపోవడానికి కారణాలివే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బన్నీ మాత్రం పవన్ విక్టరీ గురించి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్ విషయానికి వస్తే పుష్ప ది రూల్ (Pushpa 2) సినిమాతో ఈ హీరో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సుకుమార్ (Sukumar) ఈ సినిమాకు దర్శకుడు కాగా రష్మిక (Rashmika) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమా సినిమాకు బన్నీ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా పుష్ప2 సినిమాతో బన్నీ మార్కెట్ ఏ రేంజ్ లో పెరుగుతుందో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ సినిమా కలెక్షన్ల పరంగా అదరగొడుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. బన్నీ సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

అల్లు అర్జున్ తన యాక్టింగ్ స్కిల్స్ తో ఇతర భాషల అభిమానులను సైతం మెప్పిస్తున్నారు. పుష్ప ది రూల్ సాంగ్స్ కూడా ఒక సినిమాను మించి మరొకటి ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2 సినిమా బిజినెస్ పరంగా కూడా అదరగొడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.