March 19, 202501:12:18 PM

Ananya Agarwal: ‘మజిలీ’ చైల్డ్‌ యాక్టర్‌ యంగ్‌ లుక్‌ భలే బోల్డబ్బా.. మీరు చూశారా?

ఆడపిల్లలు ఎంత త్వరగా ఎదిగిపోతారో? అని అంటుంటారు. మొన్న మొన్నటివరకు చిన్న పిల్లలా గంతులేసుకుంటూ సందడి చేసేది, అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందమ్మా అనే మాటలూ వినే ఉంటారు. సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ల విషయంలో అయితే ఈ మాట ఇంకా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అలా ‘మజిలీ’ (Majili) సినిమా చిన్నారి (ఇప్పుడు కుర్రది లెండి) ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 2019లో విడుదలై మంచి విజయం అందుకున్న చిత్రం ‘మజిలీ’.

శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన చిన్నారికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది అంటే అతిశయోక్తి కాదు. సినిమాలో మీరా అనే పాత్రలో ఆ చిన్నారి కనిపించింది. ఆమె పేరే అనన్య అగర్వాల్‌ (Ananya Agarwal) . రోల్ పోషిస్తుంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోలు చూసి హీరోయిన్ మెటీరియల్ అని అనేస్తున్నారు కూడా. అనన్య అగర్వాల్ 2004లో ముంబయిలో పుట్టింది. అంటే ఇప్పుడు 20 ఏళ్లు వచ్చేశాయి.

‘తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా’ అనే టీవీ సీరియల్‌తో టీవీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టింది అనన్య. ఆ తర్వాత వివిధ సీరియల్స్‌లో నటించింది. ‘సబ్‌కీ లాడ్లీ బెబో’, ‘యహా మే ఘర్‌ ఘర్‌ ఖాలీ’, ‘ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూ’, ‘ఏక్‌ నయీ చోటీ సీ జిందగీ’, ‘క్యా హుహా తేరీ వాదా’, ‘అమృత్‌ మంథన్‌’, ‘మహాభారత్‌’, ‘ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ హథీమ్‌’, ‘బంధన్‌’, ‘సియా కె రామ్‌’, ‘మేరీ దుర్గా’, ‘రూప్‌ – మర్ద్‌ కా నయా స్వరూప్‌’, ‘లాక్‌డౌన్‌ కి లవ్‌ స్టోరీ’ సీరియల్స్ నటించి మెప్పించింది.

‘మజిలీ’ తర్వాత అనన్య మరో సినిమా చేయలేదు. బుల్లితెరపైనే నటనను కంటిన్యూ చేసింది. అయితే త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏ హీరోతో తొలి సినిమా చేస్తుందో?

 

View this post on Instagram

 

A post shared by Ananyaa Agrawal (@ananyaa_0104)

 

View this post on Instagram

 

A post shared by Ananyaa Agrawal (@ananyaa_0104)

 

View this post on Instagram

 

A post shared by Ananyaa Agrawal (@ananyaa_0104)

 

View this post on Instagram

 

A post shared by Ananyaa Agrawal (@ananyaa_0104)

 

View this post on Instagram

 

A post shared by Ananyaa Agrawal (@ananyaa_0104)

 

View this post on Instagram

 

A post shared by Ananyaa Agrawal (@ananyaa_0104)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.