March 16, 202507:34:41 AM

Anjana Devi: పవన్‌ ఘన విజయం వేళ… వైరల్‌గా మారిన అంజనమ్మ, ఆద్య వీడియోలు

మొదటిసారి పోటీ చేసి గెలవడం ఒక కిక్‌ అయితే.. తొలిసారి ఓడిపోయి రెండోసారి భారీ విజయం సాధించడం ఇంకా పెద్ద కిక్‌. ఇప్పుడు అలాంటి ఫీలింగ్‌లోనే ఉన్నారు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అతని ఫ్యాన్స్‌. పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున ట్వీట్లు, పోస్టులు, వీడియోలు వస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో ఓ రెండు వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

విలాసవంతమైన జీవితం గడపాల్సిన తనయుడు.. ప్రజాసేవ కోసం కదిలి చాలామందితో నానా మాటలు పడితే ఏ తల్లికైనా ఎలాంటి బాధ ఉంటుందో చెప్పండి. ఆ బాధను ఎప్పుడూ బయటపెట్టని తల్లి.. తనయుడు గెలిచాక ఆనందాన్ని బయటపెట్టింది. అమ్మ ప్రేమ, దీవెనలు కురిపించింది. ఆమెనే అంజనాదేవి. పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించిన సందర్భంగా. ఆ పార్టీ గుర్తు గాజు గ్లాసును ఉద్దేశించి ‘‘మా అబ్బాయి రాజకీయాల్లో విజయం అందుకోవడం ఆనందంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు తగ్గ ఫలితం ఇచ్చాడు’’ అని మాట్లాడారు.

అంతేకాదు ఈ రోజు నుండి గాజు గ్లాసులోనే టీ తాగుతా అంటూ టీని ఆస్వాదిస్తూ ఆ వీడియలో కనిపించారామె. ఇప్పుడు ఈ వీడియోను పవన్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు వైరల్‌ చేస్తున్నారు. మరోవైపు కూతురు ఆద్యకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది. చేతిలో గాజు గ్లాసులో జ్యూస్‌ను పట్టుకున్న కొన్ని ఫొటోలను తల్లి రేణు దేశాయ్‌ వీడియోగా మార్చి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘అకిరా, ఆద్య హ్యాపీగా ఉన్నారు’ అంటూ రాసుకొచ్చారు.

ఇప్పటికే చిరంజీవి (Chiranjeevi) ‘నువ్వు గేమ్‌ ఛేంజర్‌వి, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌వి’ తన ఆశీర్వాదం అందించిన విషయం తెలిసిందే. సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej)  అయితే ఏకంగా పవన్‌ ఎత్తుకుని గిరగిరా తిప్పేసి ఆనందం వెలిబుచ్చాడు. ఈ అభినందనలు ఈ రోజు కూడా కొనసాగనున్నాయి. చూద్దాం ఇంకెన్ని వీడియోలు వైరల్‌ అవుతాయో.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.